బుచ్చిబాబు కోసం విశ్వ‌రూపం చూపించ‌నున్న చ‌ర‌ణ్‌

ఆర్ఆర్ఆర్ సినిమాతో త‌న క్రేజ్ ను గ్లోబ‌ల్ లెవెల్ లో పెంచుకున్న రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా పూర్త‌వ‌గానే చ‌ర‌ణ్, బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను చేయ‌నున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. జాన్వీ క‌పూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాతో బుచ్చిబాబు భారీ టార్గెట్ ను పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ న‌ట‌న నెక్ట్స్ లెవల్ లో ఉంటుంద‌ని టాక్. చ‌ర‌ణ్ క్యారెక్ట‌రైజేష‌న్ కోసం బుచ్చిబాబు చాలా స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నాని తెలుస్తోంది. ఈ సినిమాతో చ‌ర‌ణ్ మ‌రోసారి త‌న స‌త్తా చాటుకుంటాడ‌ని, ఈ పాత్ర‌ను బుచ్చిబాబు చాలా స్పెష‌ల్ గా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

చ‌ర‌ణ్ కెరీర్లో 16వ సినిమాగా వ‌స్తున్న మూవీలో చ‌ర‌ణ్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చూస్తార‌ని యూనిట్ స‌భ్యులంటున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా విష‌యంలో అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. స్క్రిప్ట్ ద‌శ‌లోనే ఈ సినిమాపై అంద‌రికీ అంచ‌నాలు బాగా పెరిగాయి. పీరియాడిక‌ల్ క‌థ‌తో బుచ్చిబాబు ఈసారి మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని చెప్తున్నారు. నిర్మాత‌లు కూడా బ‌డ్జెట్ విష‌యంలో లిమిట్స్ పెట్ట‌కుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.  

Related Posts

Latest News Updates