చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పునఃదర్శన తేదీని నిర్వాహకులు ప్రకటించారు. ఆ రోజు ఓంకారేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటలకు మహాభిషేక పూజతో పాటు సంప్రదాయంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత 6.30 గంటలకు ఆలయ మహాద్వారాన్ని తెరవనున్నారు. అలాగే అదే రోజు ఉదయం 8.30 గంటలకు కేదార్‌నాథుడికి హారతి ఇవ్వనున్నారు. బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభం కానున్నది. బద్రీనాథ్ ధామ్ తలుపులు ఈ సంవత్సరం ఏప్రిల్ 27 ఉదయం 7:10 గంటలకు తెరవనున్నారు. బసంత్ పంచమి శుభ సందర్భంగా తెహ్రీలోని నరేంద్ర నగర్ రాజమహల్ వద్ద ధామ్ పోర్టల్స్ తెరవడానికి తేదిని నిర్ణయిస్తారు.
2002 యాత్రలో 46 లక్షల మంది యాత్రికులు చార్‌ధామ్ చేరుకున్నారు. 2022లో కరోనా కాలం తర్వాత రెండేళ్ల అనంతరం ఎలాంటి ఆంక్షలు లేకుండా సాగిన చార్‌ధామ్ యాత్ర గత ఏడాది కొత్త రికార్డు సృష్టించింది. తొలిసారిగా 46 మంది లక్షల మంది యాత్రికులు చార్‌ధామ్‌లను సందర్శిచారు. నవంబర్ 19న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయడంలో చార్‌ధామ్ యాత్ర ముగిసింది.