కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్రకు విచ్చేసిన సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నందమూరి తారకరత్నను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనంతరం తారకరత్న భార్య అలేఖ్య, తండ్రి మోహన కృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు. తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయినప్పుడు అక్కడే ఉన్న బాలకృష్ణ ఈ సందర్భంగా మొత్తం విషయాలను చంద్రబాబుకు తెలియజేశారు. తారకరత్న అందుతున్న చికిత్సపై డాక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.