టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా వున్నది ఏపీలోనే అని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఐడీ ఓ పనికిమాలిన శాఖగా మారిపోయిందని, తప్పు చేసిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ సారథ్యంలోని వైసీపీని ఇంటికి పంపితేనే రాష్ట్రంలో పరిస్థితులు బాగుపడతాయని అన్నారు. కర్నూలు, నంద్యాలలో ప్రాజెక్టులు తమ హయాంలోనివే అని, జిల్లాల్లో పలు ప్రాజెక్టులు పూర్తి కాకుండా సీఎం కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చినా, ఈ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం, మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు.
