యువతకి స్ఫూర్తినిచ్చే”చమన్” (ఎడారి లో పుష్పం)

దివంగత “శ్రీ చమన్ సాబ్ గారు” ఆయన జీవిత చరిత్రను అభిమానుల కోరిక మీద, సినిమాగా తీయాలనుకోవటం జరిగింది. ఆయన బ్రతికున్న రోజుల్లోనే సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడం జరిగింది. విధివశాత్తు “శ్రీ చమన్ గారు” కాలం చేయడంతో అయన మిత్రుడిగా ఆయన మీద అభిమానంతో సినిమాను రూపొందించాలనుకున్నాను. కరోనా కారణంగా ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది. అన్ని కుదుట పడడటంతో ముఖ్యంగా ఈ రోజు “శ్రీ చమన్” గారి కుమారుడైన “ఉమర్ ముక్తర్” కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మహనీయుడి జీవితం ఆదర్శప్రాయమైన ఆయన వ్యక్తిత్వం నేటి యువతకు తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ఆ మహనీయుడికి  ఘనమైన నివాళిని తెలియ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. శ్రీ చమన్ గారు దర్శకత్వ బాధ్యతల్ని “వెంకట్ సన్నిధి” చేత చేయించాలని భావించారు. ఆయనకు మాట ఇవ్వటంతో “వెంకట్ సన్నిధి” దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ “జి.వి. 9 ఎంటర్టైన్మెంట్” సంస్థ ద్వారా జివి చౌదరి గారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పేరు “చమన్” గా ఖరారు చేసారు. “సి రామ్ ప్రసాద్” డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పని చేస్తున్నారు.  త్వరలోనే సినిమా సాకేంతిక నిపుణులు, పూర్తి తారాగణం వెల్లడిస్తాం. జి.వి. చౌదరి ప్రొడ్యూజర్ మాట్లాడుతూ: నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ “దూదేకుల చమన్‌ సాబ్”. అయ్యన కుమారుడు “ఉమర్‌ ముక్తర్‌” బర్త్ డే కానుకగా, జి.వి. 9 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో పాటు మూవీ టైటిల్ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీ గా తెరకెక్కుతున్న “శ్రీ చమన్” గారి బయోపిక్ సినిమా కి, “సి రామ్ ప్రసాద్” డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ చేయడం మాకు చాలా హ్యాపీ గా ఉంది. అదే విధంగా “వెంకట్ సన్నిధి” దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ, యుంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మా సినిమా టైటిల్ పేరు “చమన్” (ఎడారి లో పుష్పం) ఈ సినిమా అందరిని అలరించబోతుంది. త్వరలోనే అక్టోబర్ లో కాస్టింగ్ వివరాలు వెల్లడిస్తాము. నేను ఎన్నో సంవత్సరాలు నుంచి ఇండస్ట్రీ లో పని చేస్తూ బాగా ఇష్టపడే వ్యక్తుల్లో బాలయ్య బాబు ఒకరు. వెంకట్ సన్నిధి డైరెక్టర్ మాట్లాడుతూ: ఒక మహనీయుడి జీవిత చరిత్ర మీద నేను డైరెక్ట్ చెయ్యబోతున్నందుకు నా అదృష్టం గా భావిస్తున్నాను. నేను ఇండస్ట్రీ లో ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తూ వచ్చాను కానీ, గత 14 సంవత్సరాలు గా నేను సినిమాలకి దూరంగా ఉన్నాను, కేవలం సినిమాలకి డైరెక్ట్ చేద్దామనే ఇష్టంతో, ఇప్పుడు నాకు ఈ సినిమాతో అవకాశం దక్కింది. శ్రీ చమన్‌ సాబ్ గురించి చెప్పాలి అంటే తన కుటుంభ భవిషత్తు అన్నింటిని ఫలంగా పెట్టి ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన జీవిత కథ ఆధారంగా కమర్షియల్ హంగులతో పాటు నిజాన్ని నిక్కచ్చిగా తెర మీద చూపించబోతున్నాం. ఆయన గురించి ఈ తరం యువత కి తేలియాలిసిన కధ ఇది. టెన్త్ క్ల్యాస్ కూడ పాస్ కానీ ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడి చిన్న స్థాయి నుంచి ఇండియా లోనే బెస్ట్ జెడ్పీ చైర్మన్‌గా అవార్డు రావడం గొప్ప విషయం. అంతే కాదు, కుల మత బేధాలు లేకుండా అందరిని సమానంగా చూసే ఏకైక వ్యక్తి  శ్రీ చమన్ గారు. అనంతపురం ఒక ఎడారి లాంటి జిల్లా ని మెరుగైన స్థాయి కి తీసుకురావడంతో ఈ సినిమాకి  “చమన్” (ఎడారి లో పుష్పం) అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా ఎవ్వరిని కించపరచని విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రొడ్యూజర్ గారితో ఎంతో అనుబంధం ఉంది. అలాగే, సి రామ్ ప్రసాద్” మా సినిమా కి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పని చేయడం మా అదృష్టం. ఇండియా లో డీఓపీ గా గొప్ప స్థాయి కి వెళ్తారని బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా కి అయ్యన అన్ని ముందుండి మామ్మలందరిని సక్సెస్ బాటలో నడిపిస్తారని కోరుకుంటున్నాను. “సి రామ్ ప్రసాద్” డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ మాట్లాడుతూ: డైరెక్టర్ వెంకట్ సన్నిధి నా చిరకాల మిత్రుడు, కథ చెప్పినప్పుడు నేను బాగా ఎక్సయిట్ అయ్యాను. ఈ సినిమా ఎవ్వరిని కించపరిచే విధంగా ఉండదని ప్రేక్షకుల అందరిని అలరించే విధంగా ఉంటుందని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా ప్రొడ్యూసర్ జి.వి. చౌదరి గారిని కలిసింది ఒక్కసారే అయ్యిన, ఆయన ఎంతో ప్యాషినేటెడ్ గా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి తో నేను కోలాబ్రేట్ అవ్వడం చాలా హ్యాపీ గా ఉంది.   మోహిత్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ: నేను ఏ.ఆర్. రెహమాన్ శిష్యుణ్ణి అయ్యనంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం ప్రొడ్యూజర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాకి వర్క్ చెయ్యబోతున్నందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది.

Related Posts

Latest News Updates