ఏపీ ప్రభుత్వానికి చాగంటి కోటేశ్వరరావు షాక్..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి  ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త  చాగంటి కోటేశ్వరరావు  షాక్‌ ఇచ్చారు. చాగంటి కోటేశ్వ‌ర‌రావు టిటిడి స‌ల‌హాదారు ప‌ద‌విని తిర‌స్క‌రించారు.దాంతో ఏపీ ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్టు ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పారాయణం కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా ఈ నియామకం చేపట్టినట్టు తెలిపారు. ఈ పదవిని చేపట్టేందుకు చాగంటి కోటేశ్వరరావు విముఖత వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వడానికే అయితే తనకు పదవులు అవసరం లేదని, టీటీడీకి ఎప్పుడు అవసరం వచ్చినా సహకరించేందుకు తాను ముందుంటానని చాగంటి స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి తన ఊపిరి అని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates