టీటీడీ ధార్మిక సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు

తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రవచనకర్తగా చాగంటి తెలుగు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో చైర్మన్‌ ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు శుక్రవారం జరిగాయి. గామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

Related Posts

Latest News Updates