అత్యాధునికంగా ఇండియా- పాక్ అంతర్జాతీయ సరిహద్దు… 30 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

ఇండియా- పాక్ అంతర్జాతీయ సరిహద్దును అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. శత్రువును దూరం నుంచే అంచనా వేయడానికి కెమెరాల వినియోగం, అలాగే 24 గంటలూ ఆకాశంలో నిఘా పెట్టడం, అవసరమైతే ఆకాశం నుంచే బుల్లెట్ల వాడకాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. దాదాపు 5500 సెక్యూరిటీ కెమెరాలను ఏర్పరుస్తున్నారు. ఇందు కోసం కేంద్రం 30 కోట్లను విడుదల చేసింది. కెమెరాలే కాకుండా డ్రోన్లు, రాత్రి పూట నిఘా కోసం హ్యాండ్ హోల్డ్ థర్మల్ ఇమేజర్లను కూడా జవాన్లకు అందిచనున్నారు.

 

ఈ మధ్య పాక్ నుంచి డ్రోన్లు అక్రమంగా భారత సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నాయి. దీనిని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దులోని తరన్ తరణ్‌ జిల్లాలో ఎగురుతున్న హెక్సాకాప్టర్‌ డ్రోన్‌ను పంజాబ్‌ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) శుక్రవారం కూల్చేశాయి. అందులో నుంచి 5 కిలోల బరువున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఈ విషయాన్ని పంజాబ్ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.

Related Posts

Latest News Updates