ఇకపై విమాన ప్రయాణాల్లో మాస్క్ తప్పనిసరికాదు. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇకపై… ప్రయాణికులు మాస్క్ తప్పనిసరి ధరించాలి అన్న అనౌన్స్ మెంట్ ఇవ్వకూడదని విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. అయితే… మాస్క్ పెట్టుకుంటే మంచిదేనని కేంద్రం వ్యాఖ్యానించింది. ఫేస్ కవర్లు ఉపయోగిస్తే మంచిది అని మాత్రమే అనౌన్స్ చేస్తే మంచిదని కేంద్రం తెలిపింది. అయితే.. దేశంలో కరోనా కేసులు విపరీతంగా వున్న సమయంలో విమానయాన ప్రయాణాల్లో మాస్కులు తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. మాస్క్ లేని వారిని దింపేసిన ఉదాహరణలు కూడా నమోదయ్యాయి.