ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ను కేంద్రం మరింత శక్తిమంతం చేసింది. ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలను తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎంఎల్‌ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం ఈ మార్పులు చేసింది. దీంతో రాష్ట్ర పోలీసు విభాగం, సీసీఐ, ఎస్ఎఫ్ఐవో, డీజీఎఫ్ టీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మిలటరీ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ తో సహా మరికొన్నింటిని కేంద్రం ఈడీ పరిధిలోకి తీసుకొచ్చింది.
గతంలో కేవలం 10 సంస్థలతోనే ఈడీ డేటాను పంచుకునేది. ఈ తాజా నోటిఫికేషన్ తో ప్రధానంగా మనీలాండరింగ్ మరియు విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన కేసులతో వ్యవహరించే ED, ముందుగా పేర్కొన్న 10 ఏజెన్సీలతో సహా మొత్తం 25 ఏజెన్సీలతో డేటాను పంచుకోగలుగుతుంది. ఈ మార్పు అనేక రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఏకీకృతం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.