భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాల్లో చాటాలి : ఎస్. జైశంకర్

దేవాలయాలు మన చరిత్రను, సంస్కృతిని కాపాడేవిగావుంటున్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత సంప్రదాయాలను, దేవాలయాలను నిర్మించడం, పునరుద్ధరించడంపై దృష్టి పెట్టిందన్నారు. దేవాలయాలను, మన సంస్కృతిని నిర్లక్ష్యం చేసిన వారిని, ఆ సమయాన్ని కూడా చూశామని అన్నారు. భారత్ గొప్ప స్థానానికి చేరుకుంటోందని, కాలచక్రం మళ్లీ గిర్రున తిరుగుతోందన్నారు. కేవలం వ్యక్తిగతంగానే సంస్కృతిని ఆచరించడం కాదని, దానిని ప్రపంచ దేశాలకు విస్తరించాల్సిన అవసరం వుందని నొక్కివక్కానించారు. భారతీయ సంస్కృతిని, చరిత్రను తిరిగి గొప్ప స్థానంలో వుంచడానికి మోదీ ప్రభుత్వం కంకణబద్ధులై వుందని ప్రకటించారు.

గ్లోబల్ రీబ్యాలెన్సింగ్ అనేది సంస్కృతిలో, రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తోందని జయశంకర్ అన్నారు. ప్రపంచం పూర్తిగా పాశ్చాత్యీకరణ జరగలేదని, ప్రపంచం అనేక సంస్కృతులు, అనేక సమాజాలుగా వుందని వివరించారు. రాజకీయ రీబ్యాలెన్సింగ్ కానీ, ఆర్థిక రీబ్యాలెన్సింగ్ కానీ జరగాలంటే సంస్కృతికి సంబంధించిన రీబ్యాలెన్స్ కచ్చితంగా జరగాలన్నారు. మన భారతీయ విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలని, అందరికీ ఆచరణలో నిబద్ధత వుంటే సాధ్యమేనని జైశంకర్ అన్నారు.

Related Posts

Latest News Updates