వచ్చే ఏడాది నుంచి భారత్ సంచార నిగమ్ లిమిటెడ్-BSNL ద్వారా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా రానున్న రెండు నుంచి మూడేళ్లలో దేశవ్యాప్తంగా 80 శాతం మేరకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలోని 50 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 5జీ సేవలతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, లాజిస్టిక్ రంగాల్లో వినూత్న మార్పులు చోటుచేసుకుంటాయని వివరించారు. ఆల్ ఇండియా రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఇప్పటికే 5G సేవలు ప్రారంభించబడ్డాయని, ప్రతి వారం దాదాపు ఐదు వేల కొత్త సైట్‌లు జోడించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.