మెగాస్టార్, నాగార్జునతో భేటీ అయిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో ఆయన భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురూ చిత్ర పరిశ్రమ గురించి పలు విషయాలు చర్చించుకున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో సోదరుడు నాగార్జునతో కలిసి భేటీ కావడం ఆనందంగా వుందన్నారు. తమతో భేటీ అయినందుకు కేంద్ర మంత్రికి మెగాస్టార్ ధన్యవాదాలు ప్రకటించారు. మరోవైపు శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని అనురాగ్ ఠాకూర్ సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Posts

Latest News Updates