చైనాతో సహా అమెరికా తదితర దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్వారా కొత్త వేరియంట్లను ట్రాక్ చెయ్యాలని, ఇందుకోసం పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచితేనే కొత్త వేరియంట్లను సరైన సమయంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకునేందుకు వీలవుతుందని సూచించారు.

మరోవైపు అంతర్జాతీయంగా కరోనా కేసులు మళ్లీ పెరగడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, జాతీయ టీకా సాంకేతిక సలహాదారుల చైర్మన్ ఆరోడా, ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బహల్, ఇతర ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు. పలు దేశాల్లో పెరుగుతున్న కొత్త వేరియంట్లపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.












