ఈ- కేవైసీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ నిధులు : తేల్చి చెప్పిన కేంద్రం

ఈ- కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద నిధులు జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది. రైతుల బ్యాంకు ఖాతలకు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని, లేకపోతే జనవరిలో విడుదల చేసే పీఎం కిసాన్ నిధులను నిలిపేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే… ఈ – కేవైసీ ఉద్దేశం రైతుల వాస్తవికతను ధ్రువీకరించుకోవడం కోసమేనని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగాయి.

పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా మూడు విడతలుగా రూ 6 వేల ఆర్ధికసాయం అందిస్తోంది. ఈ పథకం దుర్వినయోగమవుతోందనీ, అర్హత లేని వారు కూడా లబ్ది పొందుతున్నట్టు ఆరోపణలు వెల్లవెత్తుతుండటంతో ఈ-కేవైసీనీ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంతేకాదు.. ఈ-కేవైసీసీ పూర్తి చేయని రైతులకు 13 వ విడత పీఎం కిసాన్‌ ఆర్ధిక సహాయాన్ని నిలుపుదల చేస్తామని కూడా ప్రకటించింది.

Related Posts

Latest News Updates