కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం .. మరో 12 చీతాలు రాక

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలను తీసుకు రావడానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలలో ఆ చీతాలు భారత్కు రానున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చీతాల కోసం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య గత వారం ఒప్పందం జరిగినట్లు ఆ అధికారి చెప్పారు. ఏడు మగ, అయిదు ఆడ చీతాలను వచ్చే నెల 15 నాటికి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు తీసుకు రానున్నట్లు పేర్కొన్నారు.  ా ఈ 12 చీతాలు గత ఆరు నెలలుగా దక్షిణాఫ్రికాలో ప్రత్యేక క్వారంటైన్లో ఉన్నాయి. ఈ నెలలోనే ఇవి భారత్కు చేరుకోవలసి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది్ణ అని ఆ అధికారి చెప్పారు.

Related Posts

Latest News Updates