సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై సీసీఎస్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులిచ్చారు. ఈ నెల 4 న విచారణ నిమిత్తం సీసీఎస్ కి రావాలని ఆదేశించారు. అయితే.. దీనిపై కార్పొరేటర్ శ్రీవాణి తీవ్రంగా మండిపడ్డారు. తనపై టీఆర్ఎస్ నేతలు తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా తాను మంత్రిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ తన సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వుందని, తానేమీ తప్పు చేయలేదని ప్రకటించారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పనులను విమర్శిస్తున్నందు వల్లే ఇలా చేస్తున్నారని శ్రీవాణి పేర్కొన్నారు.