ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మెయిల్‌కు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈనెల 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. ఈనెల 11న ఉదయం 11గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో సీబీఐ ఆమెకు నోటీసులు పంపింది. ఈ నెల 6న ఢిల్లీలో గానీ, హైదరాబాద్ లో గానీ విచారణకు హాజరవ్వాలని నోటీసులిచ్చింది. అయితే… ముందస్తు షెడ్యూల్ ప్రకారం తాను 6 న విచారణకు హాజరు కాలేనని, 11,12,14,15 తేదీల్లో ఏ తేదీలోనైనా విచారణకు వస్తానని కవిత సీబీఐకి లేఖ రాశారు. దీంతో 11 న సమావేశం కావాడానికి తాము అంగీకారమే అంటూ కవితకి సీబీఐకి అధికారులు లేఖ రాశారు.