తెలంగాణ పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులిచ్చింది. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు కూడా నోటీసులుఅందాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన కాపు సమ్మేళనంలో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారినంటూ గంగులతో పాటు పలువురిని పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా మంత్రి కమలాకర్ తో ఫొటోలు దిగాడు. దీనిని సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై విచారణ కోసం ఢిల్లీకి రావాలని సీబీఐ అధికారులు మంత్రి గంగులకు నోటీసులిచ్చారు. అయితే… గంగుల నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లిన సమయంలో మంత్రి నివాసంలో లేరు. దీంతో సీబీఐ టీమ్ మంత్రి కుటుంబీకులతో మాట్లాడారు.