ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసులో ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. అక్టోబరు 17 ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. మనీశ్ సిసోడియా స్పందిస్తూ… తాను సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పారు. తన నివాసంలో 14 గంటలపాటు సీబీఐ సోదాలు జరిగాయని, అయినప్పటికీ ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. తన బ్యాంకు లాకర్ను వెతికారని, అందులో కూడా ఏమీ దొరకలేదని చెప్పారు. తన గ్రామానికి వెళ్లినా వాళ్ళకి ఏమీ దొరకలేద్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి రావాలని పిలిచారని, తాను వెళ్తానని చెప్పారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానన్నారు. సత్యమే జయిస్తుందని తెలిపారు.