హైదరాబాద్ లోని పాత బస్తీలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 6 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న సదరు సంస్థ తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది. తాజాగా సదరు ఆటోమొబైల్ కంపెనీ కార్యకలాపాలపై దృష్టి సారించిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీ ఆజంపురాలోని డాక్టర్ అంజుమ్ సుల్తానా ఇంట్లోనూ సీబీఐ తనిఖీలు జరుపుతోంది. ఆమె భర్త ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అధికారులు కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.