మాజీ సీఎం రబ్రీదేవి ఇంటికి సీబీఐ… స్టేట్ మెంట్ రికార్డు మాత్రమేనని ప్రకటన

ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణంలో సీబీఐ అధికారులు బిహార్ మాజీ సీఎం, లాలూ భార్య రబ్రీ దేవిని ప్రశ్నిస్తున్నారు. బిహార్ లోని తన నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు… ల్యాండ్ ఫర్ స్కామ్ లో ఆమె తరపు వాదనలను తాము రికార్డు చేసుకున్నామని, అంతేకానీ దాడులు లాంటివేమీ చేయలేదని సీబీఐ స్పష్టం చేసింది. రబ్రీదేవి అపాయింట్ మెంట్ తీసుకొనే… తాము నివాసానికి చేరుకున్నామని కూడా పేర్కొంది. వారం రోజుల క్రిందటే ఇదే విషయంలో సీబీఐ అధికారులు IRCTC కుంభకోణంలో నిందితులైన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. మరో 14 మందికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. గత యేడాది అక్టోబర్ లోనే లాలూ ప్రసాద్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

 

ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం లో కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ , బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి  సహా మరో 14 మందికి ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు  సోమవారం సమన్లు జారీ చేసింది. నిందితులపై సీబీఐ  దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగిణలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు సమన్లు జారీ చేసింది. 2004-2009 మధ్య యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌లో కుంభకోణం జరిగింది.

దరఖాస్తుదారుల నుంచి భూములు, ప్లాట్లు తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై కేసు నమోదైంది. దరఖాస్తుదారుల నుంచి తీసుకున్న భూములను రబ్రీదేవి, మిసా భారతి పేరిట తీసుకున్నట్లుగా ఆరోపించింది. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసిన పవన్ బన్సాల్ మేనల్లుడు విజయ్ సింగ్లా సైతం రైల్వే రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మరో కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Related Posts

Latest News Updates