ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి సీబీఐ ఝలక్ ఇచ్చింది. ఆయనపై వున్న అవినీతి కేసులో దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. లాలూ యూపీఏ 1 హయాంలో దాణా అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. మంత్రిగా వున్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ 2018 లో విచారణ ప్రారంభించింది. అవినీతి ఆరోపణలపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో గతంలో విచారణ ముగిసింది. రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసులో లాలూ యాదవ్ తో పాటు ఆయన కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, లాలూ కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ నిందితులుగా వున్నారు. లాలూ ప్రసాద్ ఇటీవలే సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.