ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని కోరింది. సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ కవితకు నోటీసులిచ్చారు. ఈ నెల 6 న ఉదయం 11 గంటలకు ఢిల్లీ, హైదరాబాద్ ఎక్కడైనా విచారణకు హాజరుకావొచ్చని సూచించింది. అయితే… తనకు సీబీఐ నోటీసులు అందాయని ఎమ్మెల్సీ కవిత అంగీకరించారు. హైదరాబాద్ లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని ప్రకటించారు.

 

ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ రిమాండ్ రిపోర్టులో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ గ్రూపు పేరుతో కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి నియంత్రించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే 36 మంది అనుమానితులు తమ తమ ఫోన్లను ధ్వంసం చేశారని వివరించారు.