ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లో మొదటి అరెస్ట్ జరిగింది. ఈ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. ఆయనను కోర్టులో హాజరు పరుస్తామని సీబీఐ ప్రకటించింది. ఇతని నుంచి పలు డాక్యుమెంట్లను తీసుకుంది. సీబీఐ అరెస్ట్ చేసిన అభిషేక్ రావు రాబిన్ డిస్టిలరీస్ కు డైరెక్టర్ గా, అనూస్ బ్యూటీ పార్లర్ డైరెక్టర్ గా వున్నట్లు సమాచారం. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర కూడా అరెస్టయ్యారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవకతవకలు, ముడుపులు ముట్టజెప్పిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ పలు దఫాలుగా దాడులు నిర్వహించారు.