
కాలుష్యం పెరగడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.



















