హీరోయిన్స్‌

‘మట్టి కుస్తీ’ లో నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ పాత్ర : హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది. ‘ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో కథానాయిక ఐశ్వర్య లక్ష్మి విలేఖరుల సమావేశంలో ‘మట్టి కుస్తీ’ విశేషాలని పంచుకున్నారు. *’మట్టి కుస్తీ’ కథని ఎప్పుడు విన్నారు ? మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే  ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది.  దీంతో ‘మట్టి కుస్తీ’ ని చేయాలని నిర్ణయించుకున్నా. *’మట్టి కుస్తీ’ లో అంత సవాల్ గా అనిపించిన అంశాలేంటి? పాత్ర చాలా ఫిజికల్ వర్క్ ని డిమాండ్ చేస్తుంది. దానికి చాలా ఫిజికల్ ప్రిపరేషన్ కావాలి. ట్రైలర్ లో స్టంట్స్ చూసే వుంటారు. ఎమోషనల్ సీన్స్ ని చేయడం నాకు ఇష్టమే. కామెడీ అనేది నా వరకూ చాలా కష్టం. మొదటి సారి ఇందులో కామెడీని ప్రయత్నించా. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. ‘మట్టి కుస్తీ’ నాకు ఓ సవాల్. ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలీదు. దర్శకుడు నా ఫెర్ ఫార్మెన్స్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది. *’మట్టి కుస్తీ’ ఎలా ఉండబోతోంది? ‘మట్టి కుస్తీ’ ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ(నవ్వుతూ) కుస్తీ, ఇగో, వినోదం అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ప్రతి ఒక్కరూ ‘మట్టి కుస్తీ’ కి కనెక్ట్ అవుతారు. ఇంత చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం వున్న చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. పైసా వసూల్ మూవీ ‘మట్టి కుస్తీ’. *విష్ణు విశాల్ తో పని చేయడం ఎలా అనిపించింది? విష్ణు విశాల్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ది బెస్ట్ కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి ఆయన సరిగ్గా నిద్రకూడా పోలేదు. విష్ణు విశాల్ కి కథల ఎంపికలో మంచి అభిరుచి వుంది. ఆయన లాంటి విజన్ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం అద్భుతం. ఆయనతో పని చేయడం చాలా అనందం గా వుంది. *తెలుగు ప్రేక్షకులు గురించి మీ అభిప్రాయం ? తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే  బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా ఎదిగింది. టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. తెలుగు నుండి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కు గొప్ప ఆదరణ వస్తోంది. చాలా పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవ్వడం గమనించాను. తెలుగు ప్రేక్షలులకు సినిమా పట్ల వున్న అభిమానం, ప్రేమే దీనికి కారణం. *తెలుగు సినిమాలు చూస్తారా? మీ అభిమాన నటులు ఎవరు ? తెలుగు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. నటీనటులందరూ ప్రేక్షకులకు వినోదం పంచడానికి కృషి చేస్తారు. ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలు చేస్తారు. సాయి పల్లవి, సత్యదేవ్ లతో పరిచయం వుంది. *రవితేజ గారు ఈ సినిమాకి ఒక నిర్మాత.. ఆయన్ని కలిశారా ? రవితేజ గారు షూటింగ్ కి రాలేదు. విష్ణు విశాల్ ని పూర్తిగా నమ్మి, కావాల్సింది సమకూర్చి ఫైనల్ ప్రోడక్ట్ ని మాత్రమే చూపించమన్నారు. ఫైనల్ అవుట్ పుట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రవితేజ గారిని కలిశాను. *ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతారు ? తమిళ్, తెలుగు, మలయాళీ ప్రేక్షకుల అభిమానం లభించింది. సినిమాల ఎంపికలో నాకు ఎలాంటి తొందరలేదు. మంచి కథ, గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలనేది నా ప్రయత్నం.

హాట్ స్టార్ టాప్ టెన్ షోస్ లో రెండు వారాలుగా ఫస్ట్ ప్లేస్ లో “ఐరావతం”

ఎస్తేర్ నోహ, అమర్ దీప్, అరుణ్  ప్రధాన పాత్రలలో నటించగా ఒక తెల్లటి కెమెరా ఆధారంగా “ఐరావతం” డిస్నీ హాట్ స్టార్ లో హిట్ టాక్ తో స్ట్రీమింగ్ అవుతోంది.. నూజివీడు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో పాన్ ఇండియా మూవీ

RRRతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో  RC15 చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న హీరోగా మ‌రో

“18 పేజీస్” చిత్రం కోసం “టైం ఇవ్వు పిల్ల” అనే పాట పాడిన తమిళ స్టార్ హీరో శింబు

తమిళ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . వల్లభ , మన్మథ లాంటి సినిమాలతో తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుని తనకంటూ కొంతమంది అభిమానులను

పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్‌’. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇటివలే విడుదలైన  ‘హను-మాన్’

‘మట్టి కుస్తీ’ ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది. ‘ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై మాస్ మహారాజా రవితేజ తో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో ‘మట్టి కుస్తీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రవితేజ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకులు సుధీర్ వర్మ, వంశీ, జ్వాలా గుత్తా  తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రవితేజ, విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జ్వాలా గుత్తా చిత్రంలోని చల్ చక్కని చిలక పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని ఆకట్టుకుంది.అనంతరం మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ..’మట్టి కుస్తీ’కి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకరన్ సౌండ్ అంటే నాకు చాలా

డిసెంబర్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు “దోస్తాన్”

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్

ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ త్రిభాషా చిత్రం

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు. కెరీర్‌ లో బెస్ట్ ఫేజ్‌ ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, తన తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుని, కళాత్మక విలువలతో కమర్షియల్ విజయాలని అందుకొని, పాత్ బ్రేకింగ్ చిత్రాలను తెరకెక్కించడంలో మాస్టర్ అయిన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జతకట్టారు.ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌ లో రూపొందుతున్న క్రేజీయస్ట్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుని, విడుదల కానుంది. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో,  అమిగోస్ క్రియేషన్స్

బోయపాటి శ్రీను అసోసియేట్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం!

కొత్త దర్శకులు మంచి కాన్సెప్ట్స్ తో వచ్చి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అదే కోవలోకి నూతన దర్శకుడు సుబ్బు ఒక సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్టార్ డైరెక్టర్ బోయపాటి

రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంలో `నాగలి`

1995లో `తపస్సు`  అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ

నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను..’మసూద’ విజయంపై హీరో తిరువీర్

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం

డిసెంబ‌ర్ 9 నుండి ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఈ సీజన్ అంతా గుర్తుండిపోతుంది : హీరో స‌త్య‌దేవ్

టాలెంటెడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా  న‌టించిన  సినిమా ‘గుర్తుందా శీతాకాలం. క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు మ‌రియు న‌టుడు నాగ‌శేఖ‌ర్ ని తెలుగుకి ద‌ర్శ‌కుడిగా

Latest News Updates

Most Read News