హీరోయిన్స్‌

“స్వాతిముత్యం”కోసం గణేష్, వర్ష బొల్లమ్మల నిత్య కల్యాణ గీతం

‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ

యు.వి.క్రియేష‌న్స్‌ చేతికి రెబల్ స్టార్ ప్ర‌భాస్‌ ‘ఆది పురుష్’

ఏ హీరో చేయ‌ని విధంగా డార్లింగ్ ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు.  ఆయ‌న చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ‘ఆది పురుష్’ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం

ఎన్టీఆర్ NTR 30 మూవీలో లేడీ సూప‌ర్ స్టార్‌ విజయ శాంతి ?

RRRతో తార‌క్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. తెలుగువారే కాదు.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా NTR 30 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నంద‌మూరి అభిమానులు  ఆతృత‌గా

నాగశౌర్య‌ ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రం నుండి “తార నా తార” సాంగ్ రిలీజ్

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. కృష్ణ వ్రింద విహారి లోని తార నా తార పాట‌ విడుద‌ల అయింది. నాగ శౌర్య , షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీ ని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ స్వరపరిచారు మహతి. లీడ్ పెయిర్ బైక్ రైడ్‌ కివెళ్ళడం, షిర్లీ  కౌగలించుకున్నపుడు శౌర్య మదురమైన అనుభూతిని పొందడం, ప్రేమికులిద్దరూ వెచ్చని రాత్రిలో హాయిగా విహరించడం లవ్లీగా వుంది. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం యూత్‌ఫుల్‌ గా ఉంది. నకాష్ అజీజ్ పాటని బ్రిలియంట్ గా పాడారు. అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ‘కృష్ణ వ్రింద విహారి’ సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది. తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం:  అనీష్ ఆర్. కృష్ణ నిర్మాత: ఉషా ముల్పూరి సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి బ్యానర్: ఐరా క్రియేషన్స  సంగీతం: మహతి స్వరసాగర్ డివోపీ: సాయిశ్రీరామ్ సహ నిర్మాత: బుజ్జి ఎడిటర్ – తమ్మిరాజు ఆర్ట్ డైరెక్టర్ – రామ్‌ కుమార్ డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్

‘అహింస’ కోసం గుమ్మడికాయ కొట్టిన దర్శకుడు తేజ

స్టార్స్‌తో పాటు నూతన నటీనటులతో బ్లాక్‌బస్టర్‌లను అందించగల సామర్థ్యం దర్శకుడు తేజ సొంతం. ఆయన తన చిత్రాలతో చాలా మంది నటులను పరిచయం చేశారు. వారిలో కొందరు స్టార్‌లుగా మారారు. కంటెంట్‌యే

సెప్టెంబర్ 16న మీ థియేటర్లలోకి వస్తున్న’శాకిని డాకిని’లు

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’  విడుదలకు సిద్ధమౌతోంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.  ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది. రెజీనా కసాండ్రా మాట్లాడుతూ..  ‘శాకిని డాకిని’ కొరియన్ ఫిల్మ్ రీమేక్. తెలుగు నేటివిటీ తగ్గట్టు అద్భుతంగా మలిచాం. ఈ సినిమా నా కెరియర్ లో ఒక మైలు రాయి. ‘శాకిని డాకిని’ లో యాక్షన్ కామెడీ తో పాటు సమాజానికి మంచి సందేశం వుంటుంది. కథానాయకులు గా ఇద్దరు హీరోయిన్స్ వుండటం ఖచ్చితంగా కొత్తగా వుంది. మాపై నమ్మకంతో ఈ సినిమా చేసిన సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ కి కృతజ్ఞతలు. కదిలే కదిలే పాట ఈ సినిమా కథకి అద్దం పడుతుంది. ఈ పాట చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మహిళలు ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 16న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్లో సినిమా చూడాలి” అని కోరారు. నివేదా థామస్ మాట్లాడుతూ.. బ్రోచేవారెవరు సినిమా సమయంలో సురేష్ బాబు గారు పరిచమయ్యారు. సినిమా గురించి చాలా చక్కని విషయాలు చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ యూనిక్ సినిమాలకు పెట్టింది పేరు. ‘శాకిని డాకిని’ కథాచర్చల్లో పాల్గొన్నప్పుడే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. అలాగే థీమ్ సాంగ్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘శాకిని డాకిని’ కెమిస్ట్రీ ఈ థీమ్ సాంగ్ లో చూశారు. ఇందులో నేను రెజీనా చాలా డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాం. చిరాకుతో కూడిన ఫన్ రిలేషన్స్ అది. టీజర్, థీమ్ సాంగ్ లో మా కెమిస్ట్రీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా లో అది ఇంకా బావుంటుంది. సెప్టెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లో చూడాలి” అని కోరారు. సునీత తాటి మాట్లాడుతూ.. ఏ సినిమా అయినా చేయడానికి నాకు మూడు ముఖ్యమైన ఎలిమెంట్స్ అనిపిస్తాయి. కథ, కథానాయకులు, కథని ఎందుకు చేస్తున్నామనే స్ఫూర్తి. ‘శాకిని డాకిని’లో ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్ ని డీల్ చేస్తారనేది కథ. ఈ కథ మొదటి నుండి మాకు చాలా నచ్చింది. ఈ కథ విషయంలో మాకు చాలా నమ్మకం వుంది.ఒక ఆడ పిల్ల పుడితే ఆమె మొదటి పాత్ర కూతురు. అలాంటి ఒక కూతురిని దగ్గర పెట్టుకొని కొన్ని సినిమాలు చూడలేకపోతున్నాం. కానీ ఈ సినిమాలో అలాంటి కూతురు దగ్గర వున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. సురేష్ బాబు గారి సహకారంతో ఈ సినిమాని చేశాం. సినిమాలో నివేదా పంచ్ లు, రెజీనా కిక్కులు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. సినిమాని ఇంటర్ నేషనల్ స్థాయిలో ఎక్కడా రాజీపడకుండా తీశాం. రెజీనా, నివేదా చాలా హార్డ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 16న సినిమాని విడుదల చేస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు అనంతరం మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కొరియన్ సినిమాలు ఎక్కువగా తీయడానికి కారణం ? *సునీత తాటి : కథ పరంగా ఒక స్పేస్ లో వున్నాం. కొత్త కథలు ఎక్కడ వున్నాయని అడుగుతుంటారు. అయితే అడాప్ట్ చేయడం కూడా అంత తేలిక కాదు. ఒక ఎమోషన్ ని తీసుకొని కల్చర్ యాడ్ చేయడం కూడా ఒక ప్రయాణం. ఈ కథని యువకుడైన అక్షయ్ అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశాడు. ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ? *నివేదా థామస్ : తెలుగులో చేస్తున్నామని తెలిసిన తర్వాత మిడ్ నైట్ రన్నర్స్ చూశాను. అందులో పాత్ర నాలానే వుంది. నాకు తెలియకుండా నా పాత్రతో స్క్రీన్ ప్లే చేసి సినిమా తీశారా అనిపించింది. ఈ పాత్ర మీరే చేస్తున్నారని చెప్పారు. పెద్దగా కష్టపడటం అవసరం లేదనిపించింది. కొంచెం తెలంగాణ యాస చక్కగా నేర్చుకొని నాలాగ వుంటే సరిపొతుందనిపించింది. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది ? *రెజీనా: నా మొదటి సినిమా నుండి యాక్షన్ చేయడం నాకు చాలా ఇష్టం. మొత్తానికి ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. వెంకట్ మాస్టర్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ ని చాలా ఎంజాయ్ చేశాను. యాక్షన్ విషయంలో విజయశాంతి లాంటి హీరోయిన్స్ స్ఫూర్తి ఎప్పుడూ వుంటుంది. ఇలాంటి యాక్షన్ పాత్రలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటింగా ఎదురుచూస్తున్నాను. *నివేదా: యాక్షన్ సీన్స్ చేయడం సవాల్ తో కూడుకున్నదే. యాక్షన్ సీన్ చేసినప్పుడు శరీరం రియాక్ట్ అవ్వాలి. ఈ సినిమాలో యాక్షన్ కథతో బ్లండై వుంటుంది. యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాం. ఇలాంటి మరిన్ని యాక్షన్ సినిమాలు చేయాలని వుంది. ఇద్దరు హీరోయిన్స్ తో సినిమా చేయాలనే ఆలోచన ఎవరిదీ ? *సునీత : ఈ సినిమా ప్రయాణంలో సంయుక్త ముఖ్య భూమిక పోషించారు. ఇద్దరు హీరోయిన్స్ తో సినిమా చేస్తే ఎలా వుంటుందని అన్నారు. సుధీర్ వర్మకి ఈ ఆలోచన నచ్చింది. ఈ క్రెడిట్ సుధీర్ కి దక్కుతుంది. ‘శాకిని డాకిని’ టైటిల్ ఇచ్చింది కూడా సంయుక్తనే. ఎగ్ హార్వెస్టింగ్ అనే యూనిక్ పాయింట్ ఈ కథలో వుంటుంది. దర్శకుడు  సుధీర్ వర్మ గారు నిరాశ చెందారు అందుకే సినిమా ప్రమోషన్స్ లో రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి .. దీనిపై వివరణ ఇవ్వండి? *సునీత: సుధీర్ వర్మ గారు ఈ సినిమా జనవరి 2020 లో మొదలుపెట్టారు. మధ్యలో గ్యాప్ కోవిడ్ వచ్చింది కదా. ఇప్పుడు ఆయన వున్న స్థాయిలో సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రతిదానికి మీరు రండని అడగడం కూడా సరికాదు. ఆయన ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్నారు. మనం ఆయన్ని సపోర్ట్ చేయాలి. ఈ సినిమా కోసం ఆయన చాలా కమిట్మెంట్ తో పని చేశారు. ఆయన సూచించిన వ్యక్తితోనే కొన్ని ప్యాచ్ వర్క్స్ చేశాం.

`కొత్త కొత్తగా’ జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్

ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `కొత్త కొత్తగా’. బి

శర్వానంద్, రాశి ఖన్నాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నూతన చిత్రం ప్రారంభం

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 33వ చిత్రం కోసం అత్యంత ప్రతిభ గల రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్యతో కలసి పని చేస్తున్నారు. టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతలలో ఒకరైన టిజి

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ల ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ ఫస్ట్ లుక్

వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం

కిచ్చా సుదీప్‌ నటిస్తున్న ‘కే3 కోటికొక్కడు’ పక్క కమర్షియల్ మూవీగా వుంటుంది : శ్రేయాస్‌ శ్రీనివాస్‌

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా శివ కార్తిక్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై  శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర డీకే

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల ‘ఉగ్రం’ షూటింగ్ ప్రారంభం

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వసున్న రెండో చిత్రం మరింత విభిన్న కథ, కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఫస్ట్ లుక్,  టైటిల్ సూచించినట్లుగా

క్రైమ్ & లవ్ స్టోరీ “నీకై నేను” ప్రారంభం

NGSP క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ వడ్డి, క్రిష్ కురుప్, అజయ్, రాజీవ్ కనకాల నటీ నటులుగా కృష్ణ కుమార్ అసూరి దర్శకత్వంలో నాగిరెడ్డి తారక ప్రభు, ఏ. హనీఫ్ లు సంయుక్తంగా

Latest News Updates

Most Read News