హీరోయిన్స్‌

సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, ఎస్‌ ఎస్‌ సి పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘హ‌రోం హ‌ర‌’

నైట్రో స్టార్ సుధీర్ బాబు18వ చిత్రానికి యూత్ ఫుల్ ఎంటర్‌ టైనర్ సెహరితో ఆకట్టుకున్న ట్యాలెంటడ్ దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. తన రెండవ సినిమా కోసం భారీ కాన్వాస్‌  తో

‘బనారస్’లో ఎక్స్ ట్రార్డినరీ కంటెంట్ వుంది..: హీరోయిన్ సోనాల్ మోంటెరో

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్  సోనాల్ మోంటెరో విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. *’బనారస్’  విడుదలకు ఇంకా నాలుగు రోజులే వుంది,, ఎలా అనిపిస్తుంది ? ఎక్సయిట్ మెంట్, నేర్వస్నెస్.. రెండూ వున్నాయి. ఇది నా మొదటి పాన్ ఇండియా మూవీ. అన్ని పరిశ్రమలకు ఈ సినిమాతో పరిచయం కావడం ఎక్సయిటింగ్ గా అదే సమయంలో నెర్వస్ గా కూడా వుంది. ప్రేక్షకులు తప్పకుండా బనారస్ చిత్రాన్ని ఇష్టపడతారనే నమ్మకం వుంది. *పాన్ ఇండియాకి మీరు కొత్త .. ప్రమోషన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ? కన్నడ ఎనిమిది సినిమాలు చేశాను. మిగతా చోట్ల నేను కొత్తే. హిందీ, తెలుగు పరిశ్రమల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మా నమ్మకాన్ని పెంచింది. *ట్రైలర్ లో టైం ట్రావెల్, ప్రేమ కథ కనిపించాయి.. ఇంతకీ బనారస్ జోనర్ ఏమిటి ? టైం ట్రావెల్ కథలో చిన్న భాగం మాత్రమే. లవ్ స్టొరీ, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని వైవిధ్యమైన ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా వుంటుంది. బనారస్ ని అద్భుతంగా చూపించాం. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అసాదారణమైన స్క్రిప్ట్ ఇది.  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. *బనారస్ లో మీ పాత్ర ప్రాధన్యత ఎలా వుంటుంది ? జయతీర్ధ గారి సినిమాల్లో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధన్యత వుంటుంది. ఇందులో కూడా నా పాత్ర చాలా కీలకమైనది. ఇందులో ధని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోకి ఎంత ప్రాధన్యత వుంటుందో  హీరోయిన్ కూడా అంతే ప్రాధాన్యత వున్న కథ ఇది. *కాంతార లాంటి విజయం తర్వాత కన్నడ నుండి వస్తున్న చిత్రం బనారస్.. ఎలా అనిపిస్తుంది ? కాంతార విషయంలో నేను చాలా ఆనందంగా, గర్వంగా వున్నాను. మా ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథని చెప్పారు. అయితే బనారస్ పూర్తిగా భిన్నమైన సినిమా. రెండు జోనర్స్ వేరు. కాంతారని ఇష్టపడినట్లే బనారస్ ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది. *మీకు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి కదా.. చేయకపోవడానికి కారణం ? నా ద్రుష్టి సౌత్ పై వుంది. తులులో నా కెరీర్ ప్రారంభించాను. కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేనేవరో ఇక్కడవారికి తెలుసు. నాకంటూ ఒక పేరు వచ్చింది. వేరే పరిశ్రమలోకి డైరెక్ట్ గా  జంప్ చేసేయడం ఇష్టం వుండదు. అందులోనూ సౌత్ సినిమాలు బాలీవుడ్ కంటే అద్భుతంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా బాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది. తెలుగులో రాబర్ట్ సినిమాలో ఒక క్యామియో చేశా. తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి వుంది. *తెలుగు సినిమాలు చూస్తారా ? తెలుగు పరిశ్రమలో నచ్చిన అంశం ఏమిటి ? తెలుగు భాష అర్ధమౌతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోనే నా సినిమాలు షూటింగ్ జరుపుకుంటాయి. చక్కని నటన కనబరిస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. సీతారామం, ఆర్ఆర్ఆర్ , పుష్ప సినిమాలు తెలుగులోనే చూశా. విజయ దేవరకొండ అంటే ఇష్టం. *జైద్ ఖాన్ తో పని చేయడం ఎలా అనిపించింది ? జైద్ పొలిటికల్ నేపధ్యం నుండి వచ్చారు. ఆయన ఎలా వుంటారోఅనిపించేది. అయితే జైద్ నా ఆలోచనలు తప్పని నిరూపించారు. జైద్ వండర్ ఫుల్ పర్శన్. మంచి ఫెర్ ఫార్మర్. చాలా సపోర్ట్ చేస్తారు. ట్రైలర్ చూస్తే చాలా అనుభవం వున్న నటుడిలానే కనిపిస్తారు తప్పితే కొత్త నటుడనే భావన రాదు. *కొత్తగా చేయబోతున్నా సినిమాలు ? మూడు కన్నడ సినిమాలు చేస్తున్నా. అలాగే సరోజినీ నాయుడు బయోపిక్ చేస్తున్నా. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.

రా యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ మ్యూజిక్ పార్టనర్ గా సోనీ మ్యూజిక్

ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న థగ్స్ చిత్రాన్ని రియా షిబు నిర్మాతగా

ప్రముఖుల సమక్షంలో తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్

సక్సెస్ ఫుల్, డైనమిక్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో పాటు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కూడా పేరు ప్రఖ్యాతలు

ప్రముఖ దర్శకులు శివ నిర్వాణ విడుదల చేసిన ‘అభిరామ్’ చిత్రం నుండి “చాల్లే చాల్లే”సాంగ్

లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం “అభిరామ్” ఈ చిత్రం నుండి విడుదల చేసిన

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్.. ప్రీరిలీజ్ ఈవెంట్

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో

‘అనుకోని ప్రయాణం’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: సక్సెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’.

ఫాస్ట్, ప్రెజెంట్ జనరేషన్ సాంగ్స్ తో “కౌశిక వర్మ దమయంతి” త్వరలో…..

దమయంతి అనే రైటర్ కౌసిక్ వర్మను వశం చేసుకోవడానికి ఆమె చేసిన విశ్వ ప్రయత్నం విఫలం అవ్వడంతో తను ఇచ్చిన శాపం  ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్న కథ.  “కౌశిక వర్మ

రాఘవ లారెన్స్, కతిరేసన్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ‘రుద్రుడు’ గ్లింప్స్ విడుదల

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. నిర్మాతలు సినిమా

బనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ.. విజువల్ ట్రీట్ లా వుంటుంది : హీరో జైద్ ఖాన్

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరో జైద్ ఖాన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. *’బనారస్’ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి ? దాదాపు దేశం మొత్తం కవర్ చేశాం. ముంబై, పూణే,  ఢిల్లీ, లక్నో, బనారస్, గురజాత్, ఆంధ్రా, తెలంగాణ, కలకత్తా, తమిళనాడు.. ఇలా దేశం అంతా తిరిగాం. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ ఈవెంట్ లో వచ్చిన రెస్పాన్ చాలా ప్రత్యేకం. ప్రేక్షకులు చూపిన అభిమానాని కి కృతజ్ఞతలు. అలాగే లక్నో లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. *బనారస్ కి ముందు ఎవరైనా మిమ్మల్ని కలిశారా ? నాంది సతీష్ గారు ఒక తెలుగు సినిమా చేద్దామని కలిశారు. అయితే అప్పటికి నేను ఇంకా రెడీగా లేను. ఒక కోర్స్ ట్రైనింగ్ లో వున్నాను. అలాగే హిందీ నుండి కూడా రెండు అవకాశాలు వచ్చాయి. అయితే నా ద్రుష్టి సౌత్ సినిమాపైనే వుంది. *బనారస్ ని మీరే ఎంచుకున్నారా ? దర్శకుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ? బనారస్ ఛాయిస్ నాదే. నేనే దర్శకుడు జయతీర్ధని అప్రోచ్ అయ్యాను. చాలా కాలం నుండి మంచి స్క్రిప్ట్, దర్శకుడు కోసం ఎదురుచూశాను. ఫైనల్ గా బనారస్ తోజయతీర్ధ గారు వచ్చారు. అలా మా ప్రయాణం మొదలైయింది. *కెజియఫ్, కాంతార సినిమాల విజయాలతో కన్నడ సినిమా పరిశ్రమపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు బనారస్ వస్తోంది. ఈ విషయంలో ఏమైనా ఒత్తిడి ఫీలౌతున్నారా ? ఒత్తిడి కాదు కానీ భాద్యత వుంటుంది. నేను కొత్త కావచ్చు కానీ పాన్ ఇండియా అనేది చిన్న విషయం కాదు. మా నిర్మాతలకు ముందే చెప్పాను. కెజియఫ్, కాంతార తో కన్నడ సినిమా ఒక గొప్ప స్థాయిని సంపాదించుకుంది. ఈ విషయంలో నాకు చాలా ఆనందం వుంటుంది. కన్నడ నుండి మరో పాన్ ఇండియా సినిమా వస్తుందంటే ఒక స్థాయిలో వుండాలి. బనారస్ ని అన్ని భాషల పంపిణీదారులకు చూపించాం. వాళ్ళంతా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులని అలరిస్తోందని అభిప్రాయపడిన తర్వాతే పాన్ ఇండియా విడుదలని నిర్ణయించాం. *బనారస్ విజువల్స్ చూస్తుంటే బాలీవుడ్ మూవీ లా  కనిపిస్తుంది ? విజువల్స్ పై నేను ప్రత్యేక ద్యాస పెట్టాను. సౌత్ సినిమాల పట్ల బాలీవుడ్ కి ఒక చిన్న చూపు వుండేది. సౌత్ సినిమాల్లో క్యాలిటీ వుందని వారు అభిప్రాయ పడేవారు. దీనిని ద్రుష్టిలో పెట్టుకొని బనారస్ ని చాలా గ్రాండ్ గా ఎక్కడా రాజీ పడకుండా బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు ఎందులోనూ తక్కువ కాదని తెలియజేశాలా బనారస్ ని చిత్రీకరించాం. ప్రస్తుతం సౌత్ పరిశ్రమ గొప్ప స్థితిలో వుంది. *బనారస్ నేపధ్యంలో సినిమా చేయడానికి కారణం ? బనారస్ కంటెంట్ లో  ఒక మిస్ట్రీరియస్, డార్క్  ఎలిమెంట్ వుంది. దానికి బనారస్ నేపధ్యం  ఎంచుకున్నాం. కంటెంట్, బ్యాగ్డ్రాప్ .. రెండూ ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయి. బనారస్ మిస్టీరియస్  లవ్ స్టొరీ. 85శాతం షూటింగ్ బనారస్ లోనే చేశాం. ప్రేక్షకు లకి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. సస్పన్స్, కామెడీ, థ్రిల్ యాక్షన్ అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక ప్రయోగం కూడా చేశాం. అది ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో టైం ట్రావెల్ కూడా వుంటుంది. అయితే అది కథలో కొంత భాగమే. *ఇది మీ మొదటి సినిమా కదా.. ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ? మనకి ఏదైనా కావాలంటే దాని కోసం మనమే నిలబడాలి. అలాగే జీవితం చాలా చిన్నది. అందరితో ప్రేమగా వుండి నలుగురికి సాయపడటమే జీవితం. ఈ రెండు విషయాలు బనారస్ నుండి నేర్చుకున్నాను. *బనారస్ ని ఎంచుకుకోవడానికి ట్రిగ్గర్ పాయింట్ ఏమిటి ? సెకండ్ హాఫ్ లో చేసిన ఒక ప్రయోగం. ఆ ప్రయోగం విజయవంతమౌతుందనే నమ్మకం వుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారంతా మంచి రివ్యూలు ఇచ్చారు. నవంబర్ 4న ప్రేక్షకులందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా చుశామనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ఒకసారి బనారస్ వెళ్లానని అనుకుంటారు. *’బనారస్’ ఆలస్యం అవ్వడానికి కారణం ? 2019 సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టాం. అయితే అదే సమయంలో వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. లాక్ డౌన్ కి ముందే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తిన తర్వాత పాటలు షూట్ చేశాం. రెండో లాక్ డౌన్ తర్వాత  మా నిర్మాతలు సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పట్టింది. అన్ని భాషల్లో డబ్బింగ్, పాటలు రిక్రియేషన్ చేశాం. ఐదింతల పని ఎక్కువైయింది. సినిమా పూర్తి చేసిన తర్వాత అన్ని పరిశ్రమల నుండి స్నేహితులు, పంపిణీదారులని పిలిచి చూపించారు. అందరూ యునానిమస్ గా బనారస్ పాన్ ఇండియా కంటెంట్ అని అభిప్రాయపడిన తర్వాతే విడుదలకు సిద్దమయ్యాం.బనారస్ ఒక విజువల్ ట్రీట్ లా వుంటుంది.

కిరణ్ అబ్బవరం GA2 పిక్చర్స్ లో నటించిన “వినరో భాగ్యము విష్ణుకథ” ఫిబ్రవరి 17 న విడుదల

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న మరో చిత్రం

వకీల్ సాబ్ “దర్శకుడు వేణు శ్రీరామ్ చేతుల మీదుగా”భీమదేవరపల్లి బ్రాంచి” ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్

“భీమదేవరపల్లి బ్రాంచి ” ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈరోజు విడుదల చేసాడు.

Latest News Updates

Most Read News