మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం విదేశీగడ్డపై దేశ రాజకీయాలు మాట్లాడేందుకు నిరాకరించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఢిల్లీలో లో అమిత్‌షా మాట్లాడుతూ బ్రిటన్‌లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కొన్ని అంశాలు రాజకీయాలకు అతీతమైనవని అమిత్‌షా పేర్కొన్నారు. రెండు ఘటనలను ఆయన ప్రస్తావించారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఇంగ్లండ్ వెళ్లారు. ఆ సమయంలో జస్టిస్ జేసీ షా కమిషన్ ఏర్పాటైంది. ఆమెను జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే మీ దేశం ఎలాగుందని ఇంగ్లండ్‌లో విలేకరులు ఇందిరను ప్రశ్నించారు. మాకు కొన్ని అంశాలు ఉన్నాయి. కానీ, వాటిని నేనిక్కడ ప్రస్తావించదలచుకోలేదు. ఇక్కడ నేను ఒక భారతీయురాలిని. నా దేశం గురించి నేనేమీ మాట్లాడను. మా దేశం బాగానే ఉంది అన్నారు అని అమిత్‌షా వివరించారు.












