ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్ పీసీ) ఎన్నికల తేదీ వచ్చేసింది. ఫిబ్రవరి 19 న టీఎఫ్ పీసీ ఎన్నికలు జరుగుతున్నట్లు అధ్యక్షుడు సి. కల్యాణ్ ప్రకటించాడు. ఫిబ్రవరి 1 నుంచి 6 వరకూ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 19 న ఎన్నికలు..అదే రోజు సాయంత్రం కౌంటింగ్, జనరల్ బాడీ మీటింగ్ వుంటుందన్నారు. టీఎఫ్ పీసీ పదవీ కాలం ముగిసినా… ఎన్నికలు జరగడం లేదని చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి. అయితే… టీఎఫ్ పీసీపై కొందరు బురద జల్లుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కల్యాణ్ హెచ్చరించారు. ఆర్గనైజేషన్ కి చెడ్డపేరు తేవాలని చూస్తే ఊరుకోమని, ఎన్నికలు జరగడం లేదని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.












