కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాయన్ (Raayan). ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు నటనతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంనుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. మాంసం అమ్మేవాడి (butcher) పాత్రలో ధనుష్ ఊరమాస్ లుక్‌లో కసిపిస్తున్నాడు. https://cinemaabazar.com/
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలో నటించే కథనాయికను పరిచయం చేసింది చిత్రయూనిట్. మూవీలో ధనుష్‌కు జోడీగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి(Aparna balamurali) నటిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా రాయన్ నుంచి అపర్ణ బాలమురళి ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఎ. ఆర్. రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 2024లోనే విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో సందీప్ కిషన్‌తో పాటు కాళిదాస్ జయరాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. https://cinemaabazar.com/