ఉదయం 4:30 గంటలకే అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్.. పేల్చేసిన బీఎస్ఎఫ్

అంతర్జాతీయ వేదికపై శాంతి వచనాలు వల్లించే పాకిస్తాన్… మూమూలు విషయాల్లోనైతే.. అన్ని నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిచ్చేస్తుంది. ఉగ్రవాదం ప్రపంచానికి హానికరం అంటూనే.. ఉగ్రవాదాన్ని పోషిస్తుంది. తాజాగా… ఉదయం 4:30 గంటలకే భారత సరిహద్దుల్లోకి పాక్ డ్రోన్ అక్రమంగా ప్రవేశించింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లోకి పాక్ డ్రోన్ ప్రవేశించిందని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ అధికారులు ఆ డ్రోన్ పై 17 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో పాక్ డ్రోన్ కూలిపోయింది. పాక్ డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించడంతో బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది. చుట్టు పక్కల ప్రాంతాల్లో జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

 

Related Posts

Latest News Updates