అధికార బీఆరఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అందుకే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కొంత కాలంగా ఈ ఇద్దరు నేతలూ పార్టీ తీరుపై తీవ్ర అసంత్రుప్తితో వున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ పార్టీ తీరుపై మండిపడుతూనే వున్నారు.
మరోవైపు జూపల్లికి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో ఏమాత్రం పొసగడం లేదు. దీంతో ఇద్దరూ బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నష్టపోతోందని, అందుకే జూపల్లిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక… మాజీ ఎంపీ పొంగులేటి కొన్ని రోజులుగా పార్టీపై విమర్శలకు దిగుతున్నారు. పార్టీ మారుతారన్న వార్తలూ జోరుగా నడిచాయి. అయితే… ఎందుకో గానీ… ఆయనకు ఇంకా బీఆర్ఎస్ ను వీడిపోలేదు. చేరితే జాతీయ పార్టీలోనే చేరుతానని క్లారిటీ మాత్రం ఇచ్చేశారు.







