తనపై వచ్చిన లైంగిక ఆరోపణల విషయంలో బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భోరున ఏడ్చేశారు. లైంగిక ఆరోపణల విషయంలో తన బాధను చెప్పుకుంటూ ఏడ్చేశారు. ఓ చర్చి ఫాదర్ కోలంబో పుట్టిన రోజు వేడుకలకు హాజరై… ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏడ్చేశారు. తనపై కొందరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయంగా తనను ఎదుర్కోలేకే లైంగిక ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు 63ఏళ్ల వయస్సు అని, తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రాజకీయాలు చేయాలని, తాడోపేడో తేల్చేసుకుందామని సవాల్ విసిరారు.
జనగామ కరుణాపురంలో జరిగిన ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. నకు కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు. తానేమీ తప్పు చేయలేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘనపూర్‌లో 5వ సారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని రాజయ్య తెలిపారు. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సమానంగా రాణించాలని తాను కోరుకుంటానని, అలాగే ప్రోత్సహిస్తూ వుంటానని కూడా పేర్కొన్నారు. అంతటి ప్రోత్సాహం ఇస్తున్న విషయాన్ని చూసి ప్రతిపక్షాలు, స్వపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని రాజయ్య ఆరోపించారు.