లిజ్ ట్రస్ కొత్త మంత్రి వర్గంలో భారత సంతతి వ్యక్తులకు కీలక చోటు

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన కొత్త మంత్రి వర్గాన్ని ప్రకటించారు. కొత్త కేబినెట్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు చోటు దక్కించుకున్నారు. తమిళ, గోవా మూలాలున్న సుయెల్లా బ్రావెర్మన్ ను లిజ్ ట్రస్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. ఈమె బోరిస్ సర్కార్ లో అటార్నీ జనరల్ గా పనిచేశారు. ఇక… బోరిస్ ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా పనిచేసిన అలోక్ శర్మను అదే పదవిలో కొనసాగించాలని లిజ్ ట్రస్ నిర్ణయం తీసుకున్నారు.

 

 

అలోక్ శర్మ ఆగ్రా నివాసి. ఇక భారత్, శ్రీలంక మూలాలున్న రణిల్ జయవర్దనె పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. ఉప ప్రధానిగా థెరెసె కొఫె, విదేశాంగ మంత్రిగా జేమ్స్ క్లెవెర్లీ, అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా కెమీ బడెనోచ్ లను ట్రస్ నియమించారు. అయితే ప్రధాని పదవి కోసం హోరాహోరీగా తలపడిన భారత సంతతి నేత రిషి సునాక్ కు మద్దతుగా నిలిచిన కన్జర్వేటివ్ నేతలకు ట్రస్ మోండిచేయి చూపించారు. మంత్రివర్గంలో అస్సలు చోటు కల్పించలేదు.

Related Posts

Latest News Updates