ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఈ చిత్రం ‘బ్ర‌హ్మాస్త్రం’ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్రం’ మొద‌టి భాగం శివ‌.  అలియా భ‌ట్ హీరోయిన్‌. స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ..*అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారు ఈవెంట్ ఆర్గ‌నైజ్ చేస్తున్నారు. ఎలా ఉంటుందోన‌నిపించింది. అలాగే తార‌క్ ఈవెంట్‌కి వ‌స్తున్నాడంటే క్రేజ్‌, ఫ్యాన్స్ ఎలా ఉంటుందోన‌ని మ‌న‌సులో ఊహించుకున్నాను. సెప్టెంబ‌ర్ 2.. నా అన్న హ‌రికృష్ణ‌గారి బ‌ర్త్ డే. నందమూరి తార‌క రామారావుగారి బిడ్డ‌.. ఆయ‌న బిడ్డ నంద‌మూరి తార‌క రామారావు ఇక్క‌డ కూర్చున్నాడు. నా బిడ్డ ముందు నా అన్న‌కు ఓ సారి హ్యాపీ బ‌ర్త్ డే చెప్పుకుంటున్నాను. రాజ‌మౌళిగారు బ్ర‌హ్మాస్త్ర సినిమాను స‌మ‌ర్పిస్తున్నారంటే ఏదో ఊర‌క‌నే కాదు.. అయాన్ ఆల్ రెడీ స్క్రిప్ట్ చెప్పారు. నాలుగేళ్ల ముందు నుంచి రాజ‌మౌళిగారు ఈ జ‌ర్నీలో భాగ‌మై ఉన్నారు. సాధార‌ణంగా నేను రాజ‌మౌళిగారే ఆయ‌న సినిమాను మూడు నాలుగేళ్ల పాటు తెర‌కెక్కిస్తారు. సినిమాను చెక్కుతుంటారు కాబ‌ట్టే జ‌క్క‌న్న అనే పేరు వ‌చ్చింది. ఇప్పుడు త‌న ప్ర‌తి రూపంగా అయాన్ క‌నిపిస్తున్నారు. నేను చూసినంత వ‌ర‌కు బ్ర‌హ్మాస్త్ర విజువ‌ల్‌గా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరుస్తుంది. అంద‌రికీ వండ‌ర్‌ఫుల్ జ‌ర్నీగా.. విజువ‌ల్ ట్రీట్‌గా అనిపిస్తుంది. మౌనీ రాయ్ అద్భుతంగా న‌టించింది. ర‌ణ్‌భీర్ క‌పూర్ – ఆలియా భ‌ట్‌ల‌ను చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు నా స్నేహితుల‌య్యారు. మంచి టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు. అందుకే వారిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. టాలెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి.. ఎలా ఎంక‌రేజ్ చేయాలో క‌ర‌ణ్ జోహార్‌కు చాలా బాగా తెలుసు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ కాన‌టువంటి భారీ చిత్రంగా బ్ర‌హ్మాస్త్ర ఉండ‌బోతుంది. భారీ రేంజ్లో విడుద‌ల‌వ కానుంది’’ అన్నారు.*యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ముందుగా నా అభిమానులకు క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తున్నాం. ఎంతో ఆర్భాటంగా వేడుక చేయాల‌నుకున్నాం. కానీ పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌లేమ‌ని అన్నారు. వాళ్లు మ‌న సేఫ్టీ కోసమే చెప్పారు. వారి మాట‌ల‌ను వినాల్సిన బాధ్య‌త పౌరులుగా మ‌న‌కుంది. అందుక‌నే ఈవెంట్‌ను చేయాల్సిన చేయలేక‌పోతున్నాం. ఇక్క‌డ‌కు రావాల‌నుకున్న అభిమానులు రాలేక‌పోయినందుకు వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పుకుంటున్నాం. వారు ఈవెంట్‌కి రాలేక‌పోయిన‌ప్ప‌టికీ మంచి సినిమాల‌ను ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం.*నేను ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలా మంది న‌టీన‌టులను ఇష్ట‌ప‌డ‌తాను. అయితే అందులో కొంద‌రే నాపై ప్ర‌భావం చూపించారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌గారి సినిమాల్లో ఆయ‌న పాత్ర‌ల్లోని ఇన్‌టెన్సిటీని ఎంతో ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న‌కు నేను పెద్ద అభిమానిని. ఆయ‌న మాట‌లు, క‌ళ్లు, ఆయ‌నెలా నిల‌బ‌డుతారో ఆస్టైల్‌.. అలా ప్ర‌తి విష‌యం నాకు ఇన్‌టెన్స్ అనే చెప్పాలి. న‌టుడిగా ఆయ‌న నాపై ఎంతో ప్ర‌భావాన్ని చూపారు. ఆ త‌ర్వాత నేను అంత క‌నెక్ట్ అయిన న‌టుడు ర‌ణ్‌భీర్‌. త‌న ప్ర‌తీ సినిమా న‌న్ను న‌టుడిగా ఎంతో ఇన్‌స్పైర్ చేసింది. ఆయ‌న సినిమాల్లో నాకెంతో ఇష్ట‌మైన సినిమా రాక్‌స్టార్‌. సాధార‌ణంగా రెహ‌మాన్‌గారి పాట‌లు అంద‌రికీ న‌చ్చుతాయి. అయితే వాటిని పెర్ఫామ్ చేసేట‌ప్పుడు ర‌ణ్‌భీర్‌లో ఇన్‌టెన్సిటీ, త‌న పాత్ర నాపై ఎంతో ప్ర‌భావాన్ని చూపింది. న‌టుడిగా నాకు స్ఫూర్తినిచ్చింది. న‌టుడిగా ర‌ణ్‌భీర్ ప్ర‌యాణం బ్ర‌హ్మాస్త్ర‌తో ఆగ‌కూడ‌ద‌ని భావిస్తున్నాను. న‌టుడిగా త‌ను ఇంకా ఎన్నో గొప్ప విష‌యాల‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఆలియాతో ఎంతో మంచి అనుబంధం ఉంది. త‌ను డార్లింగ్‌. ఆర్ఆర్ఆర్ స‌మ‌యంలో త‌న‌తో క‌లిసి ప‌ని చేశాను. త‌ను ఎంతో గొప్ప వ్య‌క్తి. అద్భుత‌మైన న‌టి. త‌న‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌. *క‌ర‌ణ్‌జోహార్‌గారు, రాజ‌మౌళిగారు క‌లిసి మ‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఏకం చేశారు. ఆయ‌నంటే ఎంతో గౌర‌వం. ఈ సినిమాతో క‌ర‌ణ్ జోహార్‌గారు త‌న కెరీర్‌లో మ‌రో మైల్‌స్టోన్‌ను సాధిస్తార‌ని భావిస్తున్నాను. అయాన్ ఎంత టెన్ష‌న్ ప‌డుతున్నాడో నాకు తెలుసు. త‌ను నాకు మంచి స్నేహితుడు. ఆయాన్‌కి ఆల్ ది బెస్ట్‌. నాగార్జున బాబాయ్ న‌టించిన ఖుదా గ‌వా సినిమా ఎంతో ఇష్టం. ఓ తెలుగు యాక్ట‌ర్ హిందీలో న‌టించి, హిందీలో మాట్లాడితే ఎలా ఉంటుందా? అని చూసిన మొద‌టి చిత్ర‌మిది. ఆయ‌న గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌టుడిగా, స్టార్‌గా ఆయ‌నేం సాధించారో మ‌న‌కు తెలుసు. నా వ‌య‌సు స‌రిపోదు. ఆయ‌న కూడా ఈ సినిమాకు ఓ బ్ర‌హ్మాస్త్రంగా ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. *సినిమా ఇండ‌స్ట్రీ ఈరోజు గ్లోబ‌ల్‌గా కూడా తెలియ‌ని ప్రెష‌ర్‌కి లోన‌వుతుంది. ఎందుకంటే ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ఏదో కావాలి. ఇంకా ఏదో కావాలి. నేను వ్య‌క్తిగ‌తం చెప్పేవిష‌య‌మేమంటే మేం ప్రెజ‌ర్‌లో ఉన్న‌ప్పుడు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాం. ప్రెషర్ బావుంది. టోట‌ల్ సినీ ఇండ‌స్ట్రీ ఈ ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేయాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. ఛాలెంజ్‌ను స్వీక‌రించి ముందుకు వెళ‌దాం. మంచి.. గొప్ప సినిమాల‌ను మ‌న ప్రేక్ష‌కుల కోసం రూపొందిస్తాం. బ్ర‌హ్మాస్త్రం సినిమా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఓ బ్ర‌హ్మాస్త్రం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. *బ్రహ్మాస్త్రం సమర్పకుడు.. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ ‘‘కరణ్ జోహార్‌గారు వినాయ‌కుడి పూజ స‌రిగ్గా చేసుండ‌రేమో తేడా జ‌రిగి ఉంటుంది అందుక‌నే ఆర్ఎఫ్‌సీలో జ‌ర‌గాల్సిన ఈవెంట్ జ‌ర‌గ‌లేదు. నిజానికి ఐదు రోజుల ముందు కూడా సిటీ క‌మీష‌న‌ర్ ఈవెంట్ చేసుకోవ‌చ్చున‌ని చెప్పారు. ఇన్‌స్పెక్ట‌ర్ వ‌చ్చి చెక్ చేసి కొన్ని మార్పులు చెప్పారు. అలాగే చేశాం. అయితే ఈరోజు ఎక్స్‌ట్రా గ‌ణేష్ నిమజ్జ‌నాలు జ‌రుగుతున్నాయి. కాబ‌ట్టి పోలీసులను ఎక్కువ‌గా కేటాయించ‌లేమ‌ని అన్నారు. వినాయ‌కుడు క‌నిక‌రించ‌లేద‌ని అనుకుంటున్నాను. ఈవెంట్ కోసం అద్భుత‌మైన అరెంజ్‌మెంట్స్ చేశాం. బ్ర‌హ్మాస్త్రంలో ర‌ణ్‌భీర్ క‌పూర్ అగ్నిని త‌న చేతి నుంచి విసిరే అద్భుత‌మైన శ‌క్తిని క‌లిగి ఉంటాడు. దాన్ని మ‌నం ట్రైల‌ర్‌లోనూ చూసుంటాం. దాన్ని లైవ్‌లో చూపించాలని మేం భారీగా ప్లాన్ చేసుకున్నాం. దాన్ని ఈవెంట్ మ‌ధ్య‌లో కూర్చుని చూసి ఎంజాయ్ చేయాల‌ని అనుకున్నాను. కానీ కుద‌ర‌లేదు. తొడ‌గొట్టు చిన్నా అని ర‌ణ్‌భీర్ క‌పూర్ అడుగుతాడు. అప్పుడు ఎన్టీఆర్ తొడ‌గొడితే ఫైర్ జ‌న‌రేట్ అయ్యేలా ప్లాన్ చేశాం. ఇప్పుడు కుద‌ర‌లేదు. కానీ దాన్ని బ్ర‌హ్మాస్త్ర స‌క్సెస్‌మీట్‌లో చేసి చూపిస్తాం. *నాకు, క‌ర‌ణ్ జోహార్‌గారికి సంబ‌ధ‌మే ఉండ‌దు. ఆయ‌న చేసే సినిమాలు, నేను చేసే సినిమాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అయితే సినిమాల‌పై ఆయ‌న‌కున్న ఆపార‌మైన ప్రేమ చూసి నేను ఆయ‌న్ని బాగా ఇష్ట‌ప‌డ‌తాను. ఆరాధిస్తాను. ఐదేళ్లు ముందు.. బ్ర‌హ్మాస్త్రం సినిమాను అయాన్ ముఖ‌ర్జీతో క‌లిసి చేస్తున్నామ‌ని చెప్పారు. న‌న్ను క‌థ విన‌మ‌న్నారు. క‌ర‌ణ్ జోహార్‌గారిపై ఉన్న గౌర‌వంతో నేను అందుకు అంగీక‌రించాను. మేం చిన్న‌ప్పుడు స‌న్న‌టి వెదురు క‌ర్ర‌ల‌పై బ్ర‌హ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, విష్ణాస్త్రం .. అంటూ రాసుకుని ఆడుకునేవాళ్లం. అది చైల్డ్ హుడ్ ఫాంట‌సీ. మాలాగే చాలా మంది ఆడుకునేవాళ్లు. అయాన్ ముఖర్జీ బ్ర‌హ్మాస్త్రం క‌థ చెప్పిన‌ప్పుడు నా చిన్న‌నాటి ఫాంట‌సీ విష‌యాల‌న్నీ గుర్తుకు వ‌చ్చాయి. ఇన్ని ఆస్త్రాల‌ను ఎలా క్రియేట్ చేయాల‌ని ఆలోచించ‌టం, దాంతో పాటు వాటిని ఉప‌యోగించే సూప‌ర్ హీరోస్ ఎలా ఉండాలి. వారి భావోద్వేగాలు ఎలా ఉండాలి అనే వాటిని విని ఆశ్చ‌ర్య‌పోయాను. *ఇది మ‌న పురాణాలు, ఇతిహాసాల్లో మ‌నం వినే ఆస్త్రాల ప‌వ‌ర్ గురించి తెలియ‌జేసే చిత్రం. ఇవ‌న్నీ మ‌న సంస్కృతిలో ఉండేవి. బ్ర‌హ్మాస్త్రం అనేది ఇండియ‌న్ క‌థ‌, ఇండియ‌న్ ఎమోష‌న్స్‌కు సంబంధించిన క‌థ‌. నాకు చేతైనంత వ‌ర‌కు నేను ఏది చేయగ‌ల‌న‌ని అనుకున్నానో దాన్ని చేద్దామని అనుకున్నాను. ఈరోజు అయాన్ నాకు కాల్ చేసి సార్‌.. ఇంకా కాస్త ప‌ని ఉంది. అంద‌రూ ఏమో హైద‌రాబాద్‌లో ఉన్నారు. నేను రావాలా వ‌ద్దా? అని అడిగాడు. అప్పుడు త‌న‌లో న‌న్ను నేను చూసుకున్నాను. నువ్వు అక్క‌డే ఉండు.. మేం ప్ర‌మోష‌న్స్ చూసుకుంటామ‌ని త‌న‌కు చెప్పాను. సినిమా ప్రేక్ష‌కుల‌తో మాట్లాడుతుంది. వారి ప్రేమ‌ను గెలుచుకుంటుంది. కాబ‌ట్టి సినిమాపై ఫోక‌స్ చేయ‌మ‌ని చెప్పాను.*నాగార్జున‌గారు ఈ సినిమాలో నంది ఆస్త్రం ధ‌రిస్తారు. నా ముద్దు పేరు కూడా నంది. అందుకు నాకు కూడా సంతోషమేసింది. తార‌క్‌.. ర‌ణ్‌భీర్ గురించి ఓ విష‌యం చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా స‌మ‌యంలో నేను, తార‌క్ క‌లిసి ర‌ణ్‌భీర్‌తో ఉన్నాం. అప్పుడు ర‌ణ్‌భీర్ న‌టించిన రాక్‌స్టార్ సినిమాలోని పాట‌లు వ‌చ్చాయి. అప్పుడు తెర‌పై క‌నిపించే ర‌ణ్‌భీర్‌తో క‌లిసి తార‌క్ పాట పాడుతున్నాడు. అది చూసి ప‌క్క‌నున్న ర‌ణ్‌భీర్ ఆశ్చ‌ర్య‌పోయాడు. క‌శ్మీరీ హిందీ నాకే స‌రిగ్గా తెలియ‌దు. ఎన్టీఆర్ ఎలా పాడుతున్నాడా? అని త‌ను అనుకున్నాడు’’ అన్నారు. *ర‌ణ్‌భీర్ క‌పూర్ మాట్లాడుతూ ‘‘నిజంగా ఈరోజు బ్ర‌హ్మాస్త్ర ఈవెంట్ ఘ‌నంగా జ‌ర‌గాల్సింది. కానీ జ‌ర‌గ‌లేక‌పోయింది. అందుకు ఎంతో బాధ‌గా ఉంది. కార్తికేయ ఈవెంట్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. నేను కూడా ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఏదో కొత్తగా చేద్దామ‌ని, తార‌క్‌తో స్టేజ్‌తో మాట్లాడుదామ‌ని రెడీ అయ్యాను. నేను తెలుగు ప్రేక్ష‌కుల కోసం తెలుగు నేర్చుకున్నాను. ‘నాకెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ బ్ర‌హ్మాస్త్ర‌. బిగ్గెస్ట్ ఈవెంట్ కూడా ఇదే. మంచి సినిమాను ఎంక‌రేజ్ చేయ‌డానికి తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. వారంద‌రికీ థాంక్స్‌. మా బ్ర‌హ్మాస్త్ర కూడా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను. ఈవెంట్‌కి వ‌చ్చిన అక్కినేని ఫ్యాన్స్‌, నంద‌మూరి ఫ్యాన్స్, రాజ‌మౌళిగారి ఫ్యాన్స్ అంద‌రికీ థాంక్స్‌. బ్ర‌హ్మాస్త్ర పార్ట్ 2 స‌మ‌యానికి తెలుగు ఇంకా బాగా నేర్చుకుని మాట్లాడుతాను’ అని తెలుగులో అన్నారు. ఇంకా మాట్లాడుతూ ‘నాగార్జునగారికి, తార‌క్‌గారికి, రాజ‌మౌళిగారికి థాంక్స్‌. వారెంతో గొప్ప హృద‌యంతో మా సినిమాను ఎంక‌రేజ్ చేయ‌టానికి ఈవెంట్‌కు వ‌చ్చారు. త్రీడీలో కూడా బ్ర‌హ్మాస్త్ర రాబోతుంది’’ అన్నారు. *ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ మాట్లాడుతూ ‘‘బ్రహ్మాస్త్ర 10 ఏళ్లుగా అయాన్ ముఖర్జీ మదిలో ఉన్న సినిమా. దీని అసలు ప్రయాణం ఏడేళ్ల ముందే ప్రారంభ‌మైంది. అయాన్ ముఖ‌ర్జీ క‌ష్టం నుంచి వ‌చ్చిన క‌ల‌ను సెప్టెంబ‌ర్ 9న ఈ ప్ర‌పంచం వీక్షించ‌బోతుంది. నా సినీ ప్ర‌యాణంలో ఇంత పెద్ద వ‌ర్క్‌ను మ‌రే సినిమాకు చూడ‌లేదు. అయాన్ త‌న ర‌క్త మాంసాల‌ను ఈ సినిమా కోసం ధార‌పోశాడు. ఈ క‌ల‌ను మీ ముందుకు తీసుకు రావ‌టంలో రాజ‌మౌళిగారు కీల‌క పాత్ర పోషించ‌టం ఎంతో ఆనందంగా ఉంది. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై బిగ్గెస్ట్ ఫిల్మ్ మేక‌ర్ మాత్ర‌మే కాదు.. అంత కంటే గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి. రాజ‌మౌళి కొడుకు కార్తికేయ అయితే నాన్‌స్టాప్‌గా మా కోసం ప‌ని చేస్తూనే ఉన్నాడు. మా కోసం ఆయ‌న చేసిన దాని గురించి ఎంత చెప్పినా త‌క్కువే. దాన్నెలా తిరిగి ఇస్తామో చెప్ప‌లేం. అయితే ఆయ‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు మేం ఆయ‌న వెనుక ఉంటాం. ఎన్టీఆర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్ఆర్ఆర్‌లో త‌న న‌ట‌న‌లో ఇన్‌టెన్సిటీ చూశాను.. అలాగే ఉండిపోయాను. త‌ను ఈ ఈవెంట్‌కి రావ‌డం గొప్ప‌గా ఉంది. బ్ర‌హ్మాస్త్ర ఇండియ‌న్ సినిమాకు చెందిన మూవీ. ఇది బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన సినిమా కాదు. ఇకపై ఉడ్స్ ఉండ‌వు. మ‌నం ఆ హ‌ద్దుల‌ను చెరిపేశాం. ప్ర‌తి సినిమా ఇండియ‌న్ సినిమాలో భాగ‌మే. *నాగార్జున‌గారు మా సినిమా ఎంతో స‌మ‌యాన్ని ప్యాష‌న్‌తో కేటాయించారు. ఆయ‌న ఈ సినిమాలో నంది ఆస్త్ర‌గా క‌నిపించారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌టం గౌర‌వంగా భావిస్తున్నాం. బ్ర‌హ్మాస్త్ర కేవ‌లం సినిమా మాత్ర‌మే కాదు.. ఇందులో ప‌ని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ప్రేమ‌తో రూపొందింది. అంద‌రూ ఒక్కొక్క పిల్ల‌ర్‌గా నిలిచారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. *ఆలియా భ‌ట్ మాట్లాడుతూ ‘‘బ్రహ్మాస్త్రం’ గురించి మాట్లాడుతూ చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. మేం ఎంతో ఆతృత‌గా ఎదురు చూసిన సినిమా. ఇంకా వారం రోజులు మాత్ర‌మే ఉంది. మా డైరెక్ట‌ర్ అయాన్ ముఖ‌ర్జీ లైట్‌లాగా మాకు గైడెన్స్ చేశాడు. త‌ను ఇక్క‌డ‌కు రావ‌టం లేద‌ని నాకు బాధ‌గా ఉంది. ఆర్ఆర్ఆర్‌లో న‌న్ను హీరోయిన్‌గా తీసుకున్నందుకు రాజ‌మౌళిగారికి థాంక్స్‌. ఆయ‌న సినిమా హీరోయిన్ అని చెప్పుకోవ‌టం సంతోషంగా ఉంటుంది. అలాగే బ్ర‌హ్మాస్త్ర సినిమా విష‌యానికి వ‌స్తే ఆయ‌నే హీరో. ఎందుకంటే ఆయ‌న లేక‌పోతే ఈ సినిమా ప్రయాణం అసంపూర్ణంగా ఉండేది. ఆయ‌న ఈ సినిమా కోసం ముందుండి మ‌మ్మ‌ల్ని న‌డిపించారు. తార‌క్ మెగా మెగాస్టార్‌.. త‌ను ఈవెంట్‌కు రావ‌టం వ‌ల్ల త‌ను మెగా మెగా హార్ట్ ఉంద‌ని ప్రూవ్ చేసుకున్నారు. నేను చూసిన వ్య‌క్తుల్లో త‌ను గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి. నాగార్జున‌ని అంద‌రూ కింగ్ అని అంటుంటారు. నిజంగానే ఆయ‌న సెట్స్‌లోనే కాదు.. మా మ‌న‌సుల్లోనూ కింగే. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌టం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌’’ అన్నారు.

Related Posts

Latest News Updates