విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. విశ్వంత్ దుడ్డుంపూడి మాట్లాడుతూ..”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ న్యూ ఏజ్ కాన్సెప్ట్. చాలా ఫన్ కాన్సెప్ట్. ఈ సినిమా కోసం రెండేళ్ళు పాటు అంకిత భావంతో పని చేశాం. దర్శకుడు సంతోష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ పై హైప్ రావడానికి కారణం దర్శకుడు సంతోష్. డీవోపీ బాల వండర్ ఫుల్ విజువల్స్ అందించారు. నిర్మాతలు వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. వారే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. వారి వలనే సినిమా ఇంతలా ప్రమోట్ అయ్యింది. గోపి సుందర్ చాలా మంచి సంగీతం అందించారు. కొరియోగ్రఫీ విజయ్ వినయ్ సినిమాలో ఒక స్వాగ్ తీసుకొచ్చారు. ఎడిటర్ విజయ్ వర్ధన్ చాలా చక్కగా కట్ చేశారు. మాళవిక చాలా సపోర్టివ్ గా పని చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు. మాళవిక మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. చాలా యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందించాం. ఇందులో దివ్య అనే పాత్రలో కనిపిస్తా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. విశ్వంత్ గమంచి కోస్టార్. చాలా ప్రోత్సహించారు. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. అందరూ తప్పకుండా చూడాలి” అని కోరారు. దర్శకుడు సంతోష్ కంభంపాటి మాట్లాడుతూ.. ఒక కొత్త దర్శకుడికి కావాల్సిన మంచిన్ కథ, మంచి ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాతో నాకు దొరికాయి. వేణు మాధవ్ , నిరంజన్ గారు చాలా ప్రోత్సహించారు. సినిమానిఒ ఎక్కడా రాజీ పడకుండా తీశారు. హీరో విశ్వంత్ ప్రోత్సాహం మర్చిపోలేను. ఈ సినిమా కోసం ది బెస్ట్ వర్క్ ఇచ్చాం. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. సినిమా అందరూ థియేటర్ లో చూసి మమ్మల్ని ఆదరించాలి” అని కోరారు.
వేణు మాధవ్ మాట్లాడుతూ.. ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ని డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించాం. దర్శకుడు సంతోష్ కంభంపాటి సినిమాని చాలా ప్యాషన్ తో తీశారు. విశ్వంత్ బ్రిలియంట్ గా ఫెర్ ఫార్మ్ చేశారు. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది. నిరంజన్ రెడ్డి గారు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. చాలా బలమైన కంటెంట్ వున్న సినిమా ఇది. ప్రేక్షకులు తప్పకుండా ఎక్సయిట్ అవుతారు. గోపీ సుందర్ మ్యూజిక్ ఇప్పటికే ఆకట్టుకుంది. బాల సరస్వతి చాలా గొప్ప విజువల్స్ ఇచ్చారు. ఆంద్ర తెలంగాణలో 350 థియేటర్లో విడుదలచేస్తున్నాం. యుఎస్ లో వంద థియేటర్లో విడుదల చేస్తున్నాం. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. సినిమా అందరూ థియేటర్ లో చూసి మమ్మల్ని ఆదరించాలి” అని కోరారు. వెంకట్ మాట్లాడుతూ.. ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ కోసం రెండేళ్ళు కష్టపడ్డాం. సినిమా చాలా కొత్తగా వుంటుంది. తప్పకుండా సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సక్సెస్ మీట్ లో కలుద్దాం” అన్నారు డీవోపీ బాల సరస్వతి మాట్లాడుతూ.. ఇది మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరో గారికి కృతజ్ఞతలు. శ్రుతి మాట్లాడుతూ.. ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ నా మనసుకు దగ్గరైన సినిమా. ఇందులో కీలక పాత్ర చేశాను. సినిమా చాలా బావుంటుంది. సినిమాని ఖచ్చితంగా థియేటర్ చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.