విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ట్రైలర్

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వస్తున్న  రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. చాలా సిగ్గు స్వభావం ఉన్న ఓ కుర్రాడి కథ ఇది. అమ్మాయిలతో మాట్లాడటానికి, చూడడానికి అసౌకర్యంగా భావిస్తాడు. కానీ అతను బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ అనే ప్రత్యేకమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు.  ఒక రోజు బాయ్‌ఫ్రెండ్‌గా నటించడానికి పెద్ద మొత్తంలో వసూలు చేస్తాడు. ఈ సమయంలోమాళవిక సతీశన్‌ అతని జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది. ట్రైలర్‌కి సంబంధించి గోపీ సుందర్ బీజీఎం ఆకట్టుకుంది. స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  బాల సరస్వతి డీవోపీగా, విజయ్ వర్ధన్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

పూజా రామచంద్రన్, మధునందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  తారాగణం: విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్, మధునందన్, రాజా రవీంద్ర, హర్షవర్ధన్, శివనారాయణ (అప్పాజీ), రూపా లక్ష్మి, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: దర్శకత్వం: సంతోష్ కంభంపాటి నిర్మాతలు: వేణు మాధవ్ పెద్ది ,  కె నిరంజన్ రెడ్డి బ్యానర్లు: స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి  సంగీతం: గోపీ సుందర్ డీవోపీ: బాల సరస్వతి ఎడిటింగ్: విజయ్ వర్ధన్

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్