బోర్డర్ వీరుడు భైరాన్ సింగ్ రాథోడ్ కన్నుమూత… హీరో అంటూ బీఎస్ఎఫ్ ట్వీట్

1971 భారత్ పాక్ యుద్ధంలో లోంగెవాలా పోస్ట్ వద్ద శత్రువులతో పోరాడిన బీఎస్ఎఫ్ రిటైర్డ్ సైనికుడు భైరాన్ సింగ్ రాథోడ్ (81) కన్నుమూశారు. 1971 లో యుద్ధంలో ఆయన హీరో అంటూ బీఎస్ఎఫ్ ట్వీట్ చేసింది. భార‌త్ – పాకిస్థాన్ మ‌ధ్య 1971లో జ‌రిగిన యుద్ధంలో భైరాన్ సింగ్ పాల్గొన్నారు. రాజ‌స్థాన్‌లోని లాంగేవాలా చెక్‌పోస్ట్ వ‌ద్ద పాక్ బ‌ల‌గాల‌ను నిలువ‌రించ‌డంలో ఆయ‌న అస‌మాన ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించారు. అందుకు గుర్తింపుగా 1972లో సేనా మెడ‌ల్ అందుకున్నారు. ఆయ‌న క‌థ‌తో బాలీవుడ్‌లో బార్డ‌ర్ అనే సినిమా వ‌చ్చింది. అందులో సునీల్ శెట్టి హీరోగా న‌టించాడు. భైరాన్ సింగ్ రాథోడ్ అసమాన ధైర్య సహసాలకు, అంకిత భావానికి బీఎస్ఎఫ్ నమస్కరిస్తోందని పేర్కొంది. ఇక.. భైరాన్ సింగ్ పఠాన్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్ నాథ్, అమిత్ షా సంతాపం ప్రకటించారు. బోర్డర్ సినిమాలో నటించిన సునీల్ శెట్టి కూడా ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.

Related Posts

Latest News Updates