పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసం వద్ద బాంబు కలకలం రేపింది. సీఎం ఇంటికి సమీపంలోనే అనుమానాస్పద పేలుడు పదార్థాన్ని పోలీసులు గుర్తించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో తక్షణమే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. బాంబును సీజ్ చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులుప్రకటించారు. ఇంతకు బాంబు సీఎం నివాసానికి ఇంత దగ్గర్లో ఎలా వచ్చిందో? తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే… బాంబును గుర్తించిన సమయంలో సీఎం భగవంత్ మాన్ ఇంట్లో లేరు. ఎవరో భగవంత్ మాన్ హత్యకు కుట్ర పన్నే బాంబు అమర్చి వుంటారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












