బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేస్తోన్న డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌, న‌టి భూమిక‌..‘యుఫోరియా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

వైవిధ్య‌మైన‌, హిట్ సినిమాల‌కు పెట్టింది పేరైన బ్లాక్ బ‌స్ట‌ర్ ఫిల్మ్ మేక‌ర్ గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం యూత్‌ఫుల్ సోష‌ల్ డ్రామా ‘యుఫోరియా’తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న దురాగ‌తాలపై తెరకెక్కుతోన్న సినిమా అని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలోనూ సినిమా ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ గ్లింప్స్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.

ప్ర‌స్తుతం సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ణ పూర్త‌య్యింది. అదే యుఫోరిక్ ఎన‌ర్జీతో మేక‌ర్స్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలో సినిమాకు సంబంధించిన స్పెష‌ల్ అప్‌డేట్ ఇస్తూ సెట్స్ నుంచి ఓ స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియోలో ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సెట్స్‌లో మ‌న‌కు క‌నిపించారు. ఆమె మేక‌ప్ వేసుకోవ‌టం, షూటింగ్‌లో పాల్గొన‌టం వంటి స‌న్నివేశాల‌ను మ‌నం ఆ వీడియోలో చూడొచ్చు. ఆమె రాక‌తో ఆ సెట్స్‌కు మ‌రింత ఉత్సాహం వ‌చ్చింది.

ఈ గ్లింప్స్ వీడియోలో వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌గారిని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. 20 ఏళ్ల క్రితం గుణ శేఖ‌ర్‌, భూమిక సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఒక్క‌డు మూవీలో క‌లిసి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. యుఫోరియా కోసం మ‌రోసారి ఈ బ్లాక్ బ‌స్ట‌ర కాంబో చేతులు క‌లిపింది. భూమిక‌ను దృష్టిలో ఉంచుకుని గుణ‌శేఖ‌ర్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు విడుద‌ల చేసిన గ్లింప్స్ చూస్తుంటే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో భూమిక ఎ లా మెప్పించ‌నున్నారోన‌ని ఆస‌క్తి మ‌రింత పెరిగింది.

ఇంకా ఈ చిత్రంలో సారా అర్జున్‌, నాజ‌ర్‌, రోహిత్‌, విఘ్నేష్ గ‌విరెడ్డి, లికితా య‌ల‌మంచిలి, అడ్డాల పృథ్వీరాజ్‌, క‌ల్ప‌ల‌త‌, సాయిశ్రీనికా రెడ్డి, ఆశ్రిత వేముగంటి, మాథ్యూ వ‌ర్గీస్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, ర‌వి ప్ర‌కాష్‌, న‌వీన్ రెడ్డి, లికిత్ నాయుడు త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో యుఫోరియా చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ప్ర‌వీణ్ కె.పోత‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ పూడి ఎడిటర్‌. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ కాల భైర‌వ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

Related Posts

Latest News Updates