టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి “పొలిమేర 3” నిర్మించనున్నారు.
“పొలిమేర 3” అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. “పొలిమేర 3” లో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
లాక్ డౌన్ టైమ్ లో “మా ఊరి పొలిమేర” డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో నేరుగా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో సీక్వెల్ “పొలిమేర 2” రూపొందించారు. ఈ సినిమా 2023 నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చింది. “పొలిమేర 3” సినిమా థియేటర్, ఓటీటీ లో ప్రేక్షకుల రివార్డ్ తో పాటు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్’ లో అవార్డ్స్ దక్కించుకోవడం విశేషం. “పొలిమేర 3” సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.