హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ లో వున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కాగితాలు ఏరుకొనే ఓ వ్యక్తికి, అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితులు కర్నూలుకు చెందిన చంద్రన్న, సురేష్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. పేలుడు జరగడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు.