ఛాలెంజ్ ను పూర్తి చేసి, మొట్ట మొదటి పార్లమెంటేరియన్ గా రికార్డ్ సాధించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అరుదైన ఘనత సాధించి, రికార్డుల్లో ఎక్కారు. ఐరన్ మ్యాన్ రిలే ఛాలెంజన్ ను పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్ గా రికార్డుల్లోకి ఎక్కారు. ట్రయాథ్లాన్ భాగంగా ఏకంగా 90 కిలోమీటర్లు సైకిల్ తొక్కి రికార్డు సాధించారు. సివిల్ సర్వెంట్ శ్రేయస్ హోసూర్, అనికేత్ జైన్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రమోట్ చేశారు. ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సూర్య 90 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కారు.ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడలు, ఫిట్‌నెస్‌పై గణనీయమైన ప్రగతి చూపించిందని సూర్య వ్యాఖ్యానించారు. ఈ ఛాలెంజ్‌ను గోవా(Goa) ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఫ్లాగ్ చేశారు. ఈ కార్యక్రమంలో 33 దేశాల నుంచి 1,500 మంది యువతీ, యువకులు పాల్గొన్నారు.

 

Related Posts

Latest News Updates