ఈశాన్య రాష్ట్రాల కౌంటింగ్ : త్రిపుర, నాగాలాండ్ లో స్పష్టమైన మెజారిటీలో బీజేపీ

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు నేడే వెలువడనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైపోయింది. మరి కొన్ని గంటల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నది స్పష్టంగా తేలిపోనుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం నాగాలాండ్ లో స్పష్టమైన ఆధిక్యాన్ని బీజేపీ కూటమి కనబరుస్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ- ఎన్డీపీపీ కూటమి ఒక స్థానంలో ముందంజలో వుండగా… 48 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.NPF 6, కాంగ్రెస్ 1, NPP3, ఇతరులు ఒక చోట ముందంజలో వున్నారు. నాగాలాండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాలు అవసరమవుతాయి.

 

ఇక.. త్రిపురలో 60 స్థానాలకు గాను దాదాపు 39 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్లోంది. మ్యాజిక్ ఫిగర్ 31 ని క్రాస్ చేయడంతో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కదులుతోంది. ఇక లెఫ్ట్ అలయెన్స్ 6 చోట్ల, టీఎంపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తే… త్రిపురలో బీజేపీయే ముందంజలో కనిపిస్తోంది.

 

ఇక మేఘాలయలో ఎన్‌పీపీ (NPP) మొత్తం 27 చోట్ల ఆధిక్యంతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, బీజేపీ 12 నియోజకవర్గాల్లో, ఇతరులు 13 చోట్ల ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. కీలకమైన మరో రాష్ట్రం నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ కూటమి 36 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఎన్‌పీఎఫ్ 7 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల ఇతరులు 13 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.

Related Posts

Latest News Updates