ఉప ఎన్నికల్లో జయ కేతనం ఎగరేసిన బీజేపీ…

తెలంగాణలోని మునుగోడుతో సహా 6 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, హర్యానా, యూపీలోని 7 నియోజకవర్గాల ఫలితాలు వచ్చేశాయి. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక… మహారాష్ట్రలోని అంధేరిలో శివసేన ఉధ్ధవ్ వర్గం అభ్యర్థి రుతుజ లట్కే విజయం సాధించారు. ఇక్కడ… బీజేపీ, ఏకనాథ్ షిండే వర్గం తమ అభ్యర్థిని ఉప సంహరించుకున్న విషయం తెలిసిందే. హర్యానాలోని అదంపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన భవ్య బిష్ణోయ్ జయ కేతనం ఎగరేశారు. ఆయనకు 67,462 ఓట్లు రాగా… కాంగ్రెస్ అభ్యర్థికి 51,752 ఓట్లు వచ్చాయి.

 

 

ఇక.. ఒడిశాలోని ధామ్ నగర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. బీజేడీ అభ్యర్థిపై 9,881 ఓట్ల తేడాతో సూర్యభన్షి సూరజ్ గెలుపొందారు. ఇక… యూపీలోని గోలా గోకర్ణ నాథ్ సీటులో కూడా బీజేపీ గెలిచింది. అమన్ గిరి బరిలోకి నిలవగా… ఎస్పీ అభ్యర్థి వినయ్ తివారీపై 34 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక… బిహార్ లో గోపాల్ గంజ్, మొకామా స్థానాలకు ఎన్నికలు జరగగా… గోపాల్ గంజ్ లో బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి 70 వేల 53 ఓట్లు సాధించగా, ఆర్జేడీ అభ్యర్థి మోహన్ గుప్తాపై 1,194 ఓట్లతో గెలిచారు. ఇక… మొకామా స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి 79,744 ఓట్లు సాధించి, బీజేపీ అభ్యర్థి సోనం దేవిపై 16,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Related Posts

Latest News Updates