మా ఎమ్మెల్యేలకు బీజేపీ బెదిరింపులు: ఆప్

ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది. ఈ సందర్భగా  ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో చేరకపోతే సీబీఐ-ఈడీ జైల్లో పెడుతుందని బీజేపీ ఆప్‌ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నదని తెలిపారు. బీజేపీ కార్యకర్త కిరణ్‌ పటేల్‌కు కశ్మీర్‌లో రాచ మర్యాదలు చేస్తారు. అతడిపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి దర్యాప్తు చేయవు. ఎందుకంటే అతడు బీజేపీ కార్యకర్త కాబట్టి. కానీ సిసోడియాను మాత్రం వాళ్లు జైల్లో పెడతారు అని మండిపడ్డారు.

Related Posts

Latest News Updates