రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ​ప్రారంభమయ్యాయి. కేసీఆర్ సర్కార్ తొమ్మిదేండ్లలో నేరవేర్చని హామీలు, కుటుంబ అవినీతి, నియంత పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో “ప్రజా గోస.. బీజేపీ భరోసా” పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో.. 11 వేల శక్తి కేంద్రాల్లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి 25వ తేదీ వరకు 15 రోజుల పాటు కొనసాగనుంది. . రోజుకు 600 బహిరంగ సభలు, 11 వేల శక్తి కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకే అరుణ, సనత్ నగర్ లో ఎంపీ డా. కె. లక్ష్మణ్, వరంగల్ పశ్చిమలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఉప్పల్ లో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. సనత్ నగర్ లో నిర్వహించే కార్నర్ మీటింగ్ కి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొంటారు. మెదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా 800 కార్నర్ మీటింగ్స్ కు ప్రణాళికలు చేశారు. మార్కెట్ యార్డ్స్, గ్రామ చౌరస్తా, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బీజేపీ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తోంది. కనీసం 200 మంది స్థానికులు పాల్గొనేలా ప్లాన్ చేసింది.

కూకట్ పల్లి – బండి సంజయ్
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్- అరుణ
సనత్ నగర్ – సునీల్ బన్సల్, లక్ష్మణ్
శేరి లింగంపల్లి – మురళీధర్ రావు
మంచిర్యాల- వివేక్ వేంకటస్వామి
జగిత్యాల- అర్వింద్ ధర్మపురి
దుబ్బాక- విజయశాంతి
ఉప్పల్- రఘునందన్ రావు
మహేశ్వరం- కొండా విశ్వేశ్వర్ రెడ్డి
పరిగి- జితేందర్ రెడ్డి
భువనగిరి- రాజగోపాల్ రెడ్డి