గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే.. ఆఫర్ ఇస్తామని బీజేపీ చెప్పింది : కేజ్రీవాల్

బీజేపీపై ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగాలని బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలకు దిగారు. ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… పోటీ నుంచి తప్పుకుంటే విచారణ ఎదుర్కొంటున్న మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియాకి ఉపశమనం కల్పిస్తామని ఆఫర్ చేసినట్లు పేర్కొన్నారు. గుజరాత్ పోటీ నుంచి తప్పుకుంటే సత్యేంద్ర జైన్ ను జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పారని అన్నారు.

 

 

అయితే… బీజేపీలో ఏ వ్యక్తి ఆ ఆఫర్ ఇచ్చారో మాత్రం వెల్లడించలేదు. ఢిల్లీలోని ఎంసీడీ సహా గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయాందళనలో బీజేపీ ఉన్నట్లు కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్కు ఐదు కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

Related Posts

Latest News Updates